King Cobra Viral : ఇంటిలోకి దూరిన 14 అడుగుల కింగ్ కోబ్రా..
తమిళనాడులో ఓ పక్క భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతుంటే మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. తమిళనాడులోని ఓ ఇంటిలో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు అధికారులు.
![King Cobra Viral : ఇంటిలోకి దూరిన 14 అడుగుల కింగ్ కోబ్రా.. King Cobra Viral : ఇంటిలోకి దూరిన 14 అడుగుల కింగ్ కోబ్రా..](https://10tv.in/wp-content/uploads/2023/12/King-Cobra-Bhagavathipuram.jpg)
King Cobra Bhagavathipuram
King Cobra In House : తమిళనాడులో ఓ పక్క భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతుంటే మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. తమిళనాడులోని భగవతీపురంలో ఓ ఇంటిలో భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నారు అధికారులు. భగవతీపురంలోని ఓ ఇంటిలోకి ఏకంగా 14 అడుగుల అత్యంత విషసర్పమైన కింగ్ కోబ్రా ప్రవేశించింది. దీంతో వారు అటవీశాఖ, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.
దీంతో అధికారులు ఆ ఇంటికి చేరుకుని అత్యంత చాకచక్యంగా కష్టపడి కింగ్ కోబ్రాను పట్టుకున్నారు. దాని ఓ సంచిలో వేసే సమయంలో కూడా అత్యంత చాకచక్యంగా వేసారు. ఆ తరువాత కూడా ఆ పాము సంచిలో చాలా వేగంగా కదలటంతో దాన్ని బలంగా పట్టుకుని సంచిలో జారవిడిచి బంధించారు. ఆ సంచినీ మరో సంచిలో వేసిన అక్కడినుంచి తరలించారు. దాన్ని అడవిలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు. కింగ్ కోబ్రోను పట్టుకున్న అధికారులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH | Tenkasi, Tamil Nadu: The Fire department captured a 14-foot-long King Cobra that had entered a residential area in Bhagavathipuram village. It was handed over to the forest department pic.twitter.com/BfXI6p4iom
— ANI (@ANI) December 6, 2023