1134 Trailer : రాబరీ నేపథ్యంతో ‘1134’ సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

‘1134’ డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న మూవీ ట్రైలర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.

1134 Trailer : రాబరీ నేపథ్యంతో ‘1134’ సినిమా.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Tollywood new money heist movie 1134 Trailer

1134 Trailer : హీస్ట్ కథాంశంతో ఎన్ని సినిమాలు వచ్చినా ఆడియన్స్ వాటిని చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపద్యతంతోనే ‘1134’ అనే ప్రయోగాత్మక చిత్రం ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమవుతుంది. కొత్త దర్శకుడు శరత్ చంద్ర తడిమేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కృష్ణ మడుపు, గంగాధర్ రెడ్డి, ఫణి శర్మ, ఫణి భార్గవ్,నర్సింగ్ వాడేకర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ నేడు రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూపించిన కథ ఏంటంటే.. ఒకరికి ఒకరు తెలియని ముగ్గురు వ్యక్తులు దొంగతనాలు చేయడానికి కలుస్తారు. ఆ తరువాత వారితో నాలుగో వ్యక్తి వచ్చి చేరిన తరువాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ అని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. ట్రైలర్ లో చూపించిన విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ కట్ కూడా చాలా రీఫ్రెషింగ్ ఉంది. ఇక ఈ ట్రైలర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు దర్శకనిర్మాతలు తెలియజేశారు.

Also read : Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి అభినందనలు.. ట్వీట్ వైరల్..

శాన్వీ మీడియా, రాంధుని క్రియేషన్స్ బ్యానర్స్ లో ఈ మూవీని నిర్మించారు. శ్రీ మురళీ కార్తికేయ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ట్రైలర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. జితేందర్ తలకంటి, నజీబ్ షేక్ సినిమాటోగ్రాఫర్స్ గా చేస్తున్నారు. థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా అందర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాతలు పేర్కొన్నారు. అలాగే ప్రేక్షకుల ఆదరణ కూడా కావాలంటూ కోరారు.