Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా ఫోటోను పోస్ట్ చేసిన‌ ముంబై ఇండియ‌న్స్.. దేనికి సంకేతం..!

Jasprit Bumrah - Mumbai Indians : తాజాగా ముంబై ఇండియ‌న్స్ త‌న అధికారిక ఎక్స్ పేజీలో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఫోటోను పోస్ట్ చేసింది.

Jasprit Bumrah : ఐపీఎల్ వేలానికి ముందు.. బుమ్రా ఫోటోను పోస్ట్ చేసిన‌ ముంబై ఇండియ‌న్స్.. దేనికి సంకేతం..!

Jasprit Bumrah

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2024 మినీ వేలానికి అంతా సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే అన్ని ఫ్రాంచైజీలు త‌మ‌కు కావాల్సిన ఆట‌గాళ్ల‌ను అట్టిపెట్టుకోగా, అవ‌స‌రం లేని ఆట‌గాళ్లల‌ను వేలానికి విడుద‌ల చేశాయి. జ‌ట్ల మ‌ధ్య ఆట‌గాళ్ల ట్రేడింగ్ ప్ర‌క్రియ‌కు మాత్రం డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు స‌మ‌యం ఉంది. డిసెంబ‌ర్ 19న దుబాయ్ వేదిక‌గా ఆట‌గాళ్ల వేలం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఈ వేలం కోసం ద‌ర‌ఖాస్తు ప్రక్రియ పూర్తి కాగా.. 1166 మంది రిజిస్ట్రేష‌న్ చేసుకున్నారు.

ఇక ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా హార్దిక్ పాండ్య తిరిగి ముంబై ఇండియ‌న్స్ గూటికి చేరుకున్నాడు. గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్య ముంబైకి వెలుతాడ‌ని ఎవ్వ‌రూ అనుకోలేదు. కాగా.. ముంబై గూటికి హార్దిక్ పాండ్య రావ‌డంతో ఆ జ‌ట్టు సీనియ‌ర్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా జ‌ట్టును వీడుతున్నాడు అనే వార్త‌లు వ‌చ్చాయి. రోహిత్ శ‌ర్మ త‌రువాత ముంబైకి తానే ప్యూచ‌ర్ కెప్టెన్ అనుకుంటున్న త‌రుణంలో పాండ్య రావ‌డంతో అత‌డి ఆశ‌లు అడియాశ‌లు అయ్యాయ‌ని, అందుక‌నే జ‌ట్టును వీడుతున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

Legends League Cricket : మ్యాచ్ మ‌ధ్య‌లో గొడ‌వ ప‌డిన గంభీర్‌, శ్రీశాంత్.. అంపైర్లు వచ్చినా ఆగ‌లేదు..!

అదే స‌మ‌యంలో బుమ్రా త‌న సోష‌ల్ మీడియాలో కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమ సమాధానం అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా అత‌డు ముంబై ఇండియ‌న్స్ పేజీని అన్‌ఫాలో చేశాడు. దీంతో బుమ్రా ముంబైని వీడుతున్నాడు అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది.

బుమ్రా ఫోటోను పోస్ట్ చేసిన‌ ముంబై ఇండియ‌న్స్..

కాగా.. తాజాగా ముంబై ఇండియ‌న్స్ త‌న అధికారిక ఎక్స్ పేజీలో జ‌స్‌ప్రీత్ బుమ్రా ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాకుండా కొన్నిసార్లు నిశబ్దమే ఉత్తమ సమాధానం అంటూ అత‌డు రాసిన కొటేష‌న్‌నే రాసింది. ఇంకోవైపు బుమ్రా మ‌ళ్లీ ముంబై ఇండియ‌న్స్ పేజీని తిరిగి పాలో చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో బుమ్రా ఎందుకు అన్‌ఫాలో చేశాడు..? మ‌ళ్లీ ఎందుకు ఫాలో అవుతున్నాడు..? అత‌డు ముంబై జ‌ట్టులోనే కొన‌సాగ‌నున్నాడా..? గొడ‌వ‌లు స‌ద్దుమ‌ణిగాయా..? అనే విష‌యాల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. అస‌లు ముంబై జ‌ట్టులో ఏం జ‌రుగుతోంద‌ని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Hamza Saleem Dar : టీ10లో ప్ర‌పంచ రికార్డు.. 43 బంతుల్లో 193 నాటౌట్‌.. ఒకే ఓవ‌ర్‌లో ఆరు సిక్స‌ర్లు, 24 బంతుల్లో సెంచ‌రీ ఇంకా..