AP Government : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది.

AP Government : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

APPSC Group 1 Notification Released (Photo : Google)

ఎట్టకేలకు నిరుద్యోగుల నిరీక్షణకు తెరపడుతోంది. వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో శుభవార్త చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఇప్పుడు గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. మొత్తం 81 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది. 81 ఉద్యోగాలలో.. డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, డీఎస్పీ పోస్టులు 26 ఉన్నాయి. నిరుద్యోగులు ఎంతోకాలంగా గ్రూప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడినట్లు అయ్యింది.

Also Read : డిగ్రీ పాస్ అయితే చాలు.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగం

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా ఇచ్చిన విషయం విదితమే. మొత్తం 897 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. డిసెంబర్ 21 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. జనవరి 10వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష ఉంటుంది.

గ్రూప్ 2 పోస్టులు.. ఏ విభాగంలో ఎన్నంటే..
రాష్ట్రంలో 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా.. నూతన సిలబస్ ప్రకారమే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుందన్నారు. ఆ తర్వాత మెయిన్ పరీక్ష తేదీని ప్రకటిస్తామన్నారు అధికారులు.

Also Read : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల

ఎక్సైజ్ ఎస్ఐ-150
డిప్యూటీ తహసీల్దార్-114
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్-218
జూనియర్ అసిస్టెంట్-31
మొత్తం 59 విభాగాల్లో పోస్టుల భర్తీ