Manchu Vishnu : న్యూజిలాండ్‌లో భార్య కోసం దొంగతనం చేసిన మంచు విష్ణు.. ఏం చేశాడంటే..?

మంచు విష్ణు న్యూజిలాండ్ అడవుల్లో తన డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు న్యూజిలాండ్‌లో భార్య కోసం ఓ దొంగతనం చేశారట.

Manchu Vishnu : న్యూజిలాండ్‌లో భార్య కోసం దొంగతనం చేసిన మంచు విష్ణు.. ఏం చేశాడంటే..?

Manchu Vishnu stolen something for his wife Viranica Reddy

Manchu Vishnu : మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని న్యూజిలాండ్ అడవుల్లో శరవేగంగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటించబోతుంది. సింగల్ షెడ్యూల్ తో ఈ మూవీని న్యూజిలాండ్ లోనే పూర్తి చేయనున్నారు. దీంతో మూవీ కావాల్సిన సెట్ ప్రోపర్టీ, ఆర్టిస్ట్ లు అందరూ న్యూజిలాండ్ చేరుకొని మూవీని తెరకెక్కిస్తున్నారు.

ఇక మంచు విష్ణుతో పాటు ఆయన సతీమణి ‘విరానికా రెడ్డి’ కూడా న్యూజిలాండ్ లోనే ఉంటున్నారు. రీసెంట్ గా విరానికా తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ వేశారు. ఆ పోస్టుకి విరానికా ఇలా రాసుకొచ్చారు.. “న్యూజిలాండ్ లో కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన నాకు ఇష్టమైన హైడ్రేంజ (Hydrangeas) పూలు కనిపించాయి. దీంతో విష్ణు కారు ఆపి నాకోసం వాటిని కోసుకు వచ్చారు” అని చెప్పుకొచ్చారు. ఆ వీడియోలో విష్ణు.. “నా ప్రేమ కోసం తనకి ఇష్టమైన పూలు తీసుకు రావడానికి వెళ్తున్నాను” అంటూ వ్యాఖ్యానించారు.

అయితే దీనిలో దొంగతనం ఏం ఉందని అనుకుంటున్నారు కదా..? న్యూజిలాండ్‌లో అలా ఎక్కడ పడితే అక్కడ పూలు కోయడం అనేది నేరం అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మంచు విష్ణు న్యూజిలాండ్‌ రూల్స్ బ్రేక్ చేశారు. న్యూజిలాండ్‌ పోలీసులు ఈ వీడియో చూడకుండా ఉండాలని కోరుకోండి అంటూ మంచు విష్ణుకి సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Also read : Pooja Hegde : చంపేస్తామంటూ దుబాయ్‌లో పూజా హెగ్డే‌కి బెదిరింపులు.. నిజమేనా..?

 

View this post on Instagram

 

A post shared by Viranica Manchu (@viranica)

ఇక కన్నప్ప విషయానికి వస్తే.. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ లో మోహన్ లాల్ కూడా జాయిన్ అయ్యారు. ప్రెజెంట్ స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ బృంద మాస్టర్ అద్వర్యంలో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతుందట. అయితే షూటింగ్ లో బృంద మాస్టర్ కాలుకి గాయం అవ్వడంతో షూటింగ్ కి కొంచెం బ్రేక్ పడింది. ఈ సాంగ్ ని మోహన్ లాల్ పై తెరికిస్తున్నట్లు తెలుస్తుంది.