Viajayakanth Family : విజయ్‌కాంత్‌ కన్నుమూత.. కుటుంబ నేపథ్యం.. కుమారుడు కూడా నటుడే..

కెప్టెన్ విజయ్‌కాంత్‌ మరణం తర్వాత ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Viajayakanth Family : విజయ్‌కాంత్‌ కన్నుమూత.. కుటుంబ నేపథ్యం.. కుమారుడు కూడా నటుడే..

Captain Vijayakanth Family Full Details Here

Viajayakanth Family : ఒకప్పటి తమిళ్ స్టార్ హీరో, DMDK పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్‌ గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్ర ఆరోగ్య సమస్యతో చికిత్స అందుకుంటూ నేడు ఉదయం చెన్నైలోని మియాట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. విజయ్‌కాంత్‌ మరణం తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆయన లేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నారు.

విజయ్‌కాంత్‌ తమిళనాడు మధురైలో 1952 ఆగస్టు 25న KN అళగర్ స్వామి, ఆండాళ్ అజాగర్ స్వామిలకు జన్మించారు. ఆయన అసలుపేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి కాగా సినిమాల్లోకి వచ్చాక విజయ్‌కాంత్‌ గా పేరు మార్చుకున్నారు. 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. విజయ్‌కాంత్‌ కి.. షణ్ముగ పాండ్యన్, విజయ్ ప్రభాకర్ అళగర్ స్వామి అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇందులో షణ్ముగ పాండ్యన్ కూడా సినిమాల్లోనే నటుడిగా ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోగా ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో బిజీ అవుతున్నాడు.

Captain Vijayakanth Family Full Details Here

Also Read : Captain Vijayakanth : కెప్టెన్ విజయ్‌కాంత్‌ సినీ ప్రస్థానం.. 20కి పైగా పోలీస్ పాత్రలు.. ఒకే సంవత్సరం 18 సినిమాలు.. 150కి పైగా సినిమాలు..

కెప్టెన్ విజయ్‌కాంత్‌ మరణం తర్వాత ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు విజయ్‌కాంత్‌ కి నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబానికి సానుభూతి తెలియచేస్తున్నారు.

Captain Vijayakanth Family Full Details Here

 

Also Read : DMDK Founder Vijayakanth passes away : విజయ్‌కాంత్‌ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నిసార్లు పోటీ చేశారు.. ఎన్నిసార్లు గెలుపొందారో తెలుసా?