Noise ColorFit Chrome : కొత్త వాచ్ కావాలా?.. నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Noise ColorFit Chrome Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. భారత మార్కెట్లో నాయిస్ కలర్ ఫిట్ క్రోమ్ స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ వాచ్ ధర ఎంతంటే?

Noise ColorFit Chrome : కొత్త వాచ్ కావాలా?.. నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ స్మార్ట్‌వాచ్ వచ్చేసిందోచ్.. భారత్‌లో ధర ఎంతో తెలుసా?

Noise ColorFit Chrome Smartwatch With 1.85-Inch AMOLED Screen Launched in India

Noise ColorFit Chrome Smartwatch : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? నాయిస్ కలర్ ఫిట్ క్రోమ్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అతి త్వరలో దేశంలో సేల్‌‌కు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85-అంగుళాల అమోల్డ్ స్క్రీన్ ఉంది. వివిధ వాచ్ ఫేస్‌లకు సపోర్టు ఇస్తుంది. వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీతో వస్తుంది. మొత్తం 3 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ నాయిస్ హెల్త్ సూట్‌తో కూడా వస్తుంది. ఇందులో హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ స్థాయి, ఒత్తిడి, నిద్ర, ఋతు చక్రం ట్రాకింగ్‌కు సపోర్టు చేస్తుంది.

Read Also : Samsung Galaxy S24 Series : భారత్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ధర తెలిసిందోచ్.. ప్రీ-ఆర్డర్ల కోసం ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

భారత్‌లో నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ ధర, లభ్యత :
ఎలైట్ బ్లాక్, ఎలైట్ మిడ్‌నైట్ గోల్డ్, ఎలైట్ సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందించే నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ భారత మార్కెట్లో ధర రూ . 5,000కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ జనవరి 19 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉంటుంది. ప్రీ-రిజర్వ్ రూ.499కి అందుబాటులో ఉంది. తద్వారా ఈ వాచ్ ధరను రూ. 4,000కి తగ్గించింది. ప్రీ-రిజర్వ్ పాస్ కూడా రూ. 2,500 వరకు మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అందులో నాయిస్ లూనా స్మార్ట్ రింగ్ కొనుగోలుపై రూ. 1,500 తగ్గింపు, నాయిస్ ఐ1 స్మార్ట్ గ్లాసెస్ కొనుగోలుపై రూ. 1,000 తగ్గింపు పొందవచ్చు.

Noise ColorFit Chrome Smartwatch With 1.85-Inch AMOLED Screen Launched in India

Noise ColorFit Chrome Smartwatch Launched in India

నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
నాయిస్ కలర్ ఫిట్ క్రోమ్ 1.85-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 100కి పైగా కస్టమైజడ్ వాచ్ ఫేస్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ నాయిస్ ట్రూ సింక్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఎక్స్‌టెండెడ్ కాలింగ్ పరిధితో బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు ఇస్తుంది. వాచ్ బాడీ పుష్ బటన్‌తో పాటు అప్లికేషన్‌ల ద్వారా నావిగేట్ చేసేందుకు ఫంక్షనింగ్ క్రౌన్‌తో వస్తుంది.

మరెన్నో హెల్త్ ఫీచర్లు :
కలర్‌ఫిట్ క్రోమ్ మోడల్ నాయిస్ హెల్త్ సూట్‌తో అమర్చారు. ఇతర ఫిట్‌నెస్ ట్రాకర్‌ల మాదిరిగానే హృదయ స్పందన రేటు, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ (SpO2) మానిటర్‌లను కలిగి ఉంటుంది. ఇది ఒత్తిడిని కొలవడానికి వినియోగదారుల నిద్రను ట్రాక్ చేయడానికి కూడా సాయపడుతుంది. ఈ గడియారం మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకర్‌తో కూడా వస్తుంది. 100 కన్నా ఎక్కువ ఇన్‌బిల్ట్ స్పోర్ట్స్ మోడ్‌లతో వస్తుంది. ఆటోమేటిక్ వర్కౌట్ డిటెక్షన్‌ను కలిగి ఉంది.

గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ :
నాయిస్ కలర్‌ఫిట్ క్రోమ్ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్‌సెట్‌లకు అనుకూలంగా ఉంటుంది. దీనిని నాయిస్ ఫిట్ అప్లికేషన్‌తో పాటు కస్టమైజ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లు, వాతావరణ అప్‌డేట్‌లు, రిమైండర్‌లు, అలారాలు, యాక్సెస్ కెమెరాతో పాటు మ్యూజిక్ కంట్రోల్స్ కూడా వీక్షించడానికి ఉపయోగించవచ్చు. గడియారం బ్యాటరీ సైజు ఇంకా వెల్లడి కాలేదు. కానీ, ఇది గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

Read Also : Moto G Play 2024 Phone : మోటో జీ ప్లే 2024 ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతో తెలుసా?