Rohan Bopanna : చరిత్ర సృష్టించ‌నున్న‌ రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌పంచ నంబ‌ర్ 1 ఆట‌గాడిగా..

భార‌త టెన్నిస్ స్టార్ రోహ‌న్ బొప్ప‌న్న ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు.

Rohan Bopanna : చరిత్ర సృష్టించ‌నున్న‌ రోహన్ బోపన్న.. 43 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌పంచ నంబ‌ర్ 1 ఆట‌గాడిగా..

Rohan Bopanna

Rohan Bopanna : భార‌త టెన్నిస్ స్టార్ రోహ‌న్ బొప్ప‌న్న ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్నాడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో అర్జెంటీనా ద్వయం మాక్సిమో గొంజాలెజ్‌-ఆండ్రెస్‌ మోల్టేనిల‌పై బోప‌న్న త‌న పార్ట్‌న‌ర్ మాథ్యూ ఎబ్డెన్ తో క‌లిసి విజ‌యం సాధించాడు. 6-4, 7-5 తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకువెళ్లారు. ఈ క్ర‌మంలోనే బొప‌న్న అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. టెన్నిస్‌లో డ‌బుల్స్ విభాగంలో ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్‌గా నిలిచిన అతి పెద్ద వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

మూడో ర్యాంకుతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టాడు బోప‌న్న. క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో విజ‌యం సాధించ‌డంతో అత‌డి ర్యాంకు మెరుగుప‌డింది. దాదాపు 46 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జ‌రిగింది. ప్ర‌త్య‌ర్థి జోడికి ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌ని బొప్ప‌న్న, మాథ్యూ ఎబ్డెన్ ద్వ‌యం వ‌రుస సెట్‌ల‌ను గెలుపొంది సెమీస్ కు దూసుకువెళ్లారు. ఈ విజ‌యంతో బొప‌న్న మొద‌టి ర్యాంకుకు చేరుకోగా, అత‌డి పార్ట్‌న‌ర్ మాథ్యూ ఎబ్డెన్ రెండో ర్యాంకు దూసుకువ‌చ్చాడు. అయితే.. ఆస్ట్రేలియా ఓపెన్ ముగిసిన త‌రువాత‌నే ర్యాంకుల‌ను అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.

IND vs ENG : క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ శుభ‌వార్త‌.. ఉప్ప‌ల్‌లో మ్యాచ్ చూడాల‌నుకునే వారికే..

గ‌తంలో అత్య‌ధిక వ‌య‌సులో నంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకున్న రికార్డు అమెరికాకు చెందిన రాజీవ్ రామ్ పేరిట ఉంది. అత‌డు 38 ఏళ్ల వ‌య‌సులో 1 అక్టోబ‌ర్ 2022లో ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

ప్ర‌పంచ నంబ‌ర్ వ‌న్ ర్యాంకును సొంతం చేసుకోనుండ‌డం పై బొప్ప‌న్న స్పందించాడు. త‌న 20 ఏళ్ల టెన్నిస్ కెరీర్‌లో స‌హ‌క‌రించిన ప్ర‌తి ఒక్క‌రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. వారాల పాటు టోర్నీలు ఆడుతూ ఈ స్థాయికి రావ‌డం ఎంతో ఆనందాన్ని క‌లిగించింద‌న్నాడు. భార‌త్ త‌రుపున టాప్ ర్యాంకు సాధించ‌డం గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌ని చెప్పుకొచ్చాడు. త‌న ప్ర‌యాణం ఇంకా ముగియ‌లేద‌న్నాడు. కుటుంబం, కోచ్‌, ఫిజియో ఇలా ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఉంద‌న్నాడు.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టులు.. కోహ్లీ స్థానంలో ఆర్‌సీబీ ప్లేయ‌ర్‌కే ఛాన్స్‌..!