Mary Kom : నేను అలా ఎక్కడా చెప్పలేదు.. రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేరీకోమ్

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై ఆమె గురువారం స్పందించారు.

Mary Kom : నేను అలా ఎక్కడా చెప్పలేదు.. రిటైర్మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన మేరీకోమ్

Mary Kom

Mary Kom Retirement News : భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తలపై ఆమె గురువారం స్పందించారు. తాను ఇప్పుడే బాక్సింగ్ ను వీడబోనని క్లారిటీ ఇచ్చారు. నేను ఆట నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వచ్చిన కథనాలన్నీ అబద్దం. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటే నేరుగా మీడియా ముందుకే వచ్చి అధికారికంగా ప్రకటిస్తా. దయచేసి నేను రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా వార్తలు ప్రచురించకండి అంటూ మేరీకోమ్ కోరారు.

Also Read : IND vs ENG : ఇంగ్లండ్ జట్టుదే తొలి బ్యాటింగ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి భారత్.. ఎందుకంటే?

మరోలా అర్థం చేసుకున్నారా ..
18ఏళ్ల వయస్సులో పెన్సిల్వేనియాలోని స్ర్కాటన్ లో జరిగిన బాక్సింగ్ పోటీల్లో మేరీకోమ్ అంతర్జాతీయ ప్రవేశం చేశారు. అప్పటి నుంచి అంతర్జాతీయ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో దేశానికి చిరస్మరణీయ విజయాలను ఆమె సాధించిపెట్టారు. 2022లో కామన్ వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్ సందర్భంగా మోకాలికి గాయం కావడంతో అప్పటి నుంచి మేరీకోమ్ రింగ్ లోకి దిగలేదు. బుధవారం మేరీకోమ్ అస్సాంలో జరిగిన ఓ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆటల్లో ఇంకా ఏదో సాధించాలనే తపన ఉంది. అయితే, నాకు వయస్సు అడ్డంకిగా మారిందని చెప్పారు. వయోపరిమితి కారణంగా ఒలింపిక్స్, ఇతర పోటీల్లో పాల్గొనలేకపోతున్నానని తెలిపారు. నాకు ఇంకా ఆడాలని ఉన్నా బలవంతంగా వైదొలగాల్సి వస్తుందని చెప్పారు. నా జీవితంలో నేను అన్నీ సాధించా.. నిజానికి ఇక రిటైర్ అవ్వాలి అంటూ ఆ కార్యక్రమంలో పేర్కొన్నారు. దీంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించారంటూ సోషల్ మీడియాతోపాటు ప్రముఖ మీడియాల్లోనూ కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ వార్తలపై మేరీకోమ్ స్పందిస్తూ.. నేను బాక్సింగ్ క్రీడకు రిటైర్మెంట్ ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Rohit Sharma : తొలి టెస్టుకు ముందు రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. ఇంగ్లాండ్ బ‌జ్‌బాల్ ఆడితే..

నిబంధనలు ఇలా..
మేరీకోమ్ కు ప్రస్తుతం 41 సంవత్సరాలు, గాయం కారణంగా కొద్దికాలంగా ఆమెకు ఆటకు దూరంగా ఉన్నారు. అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం.. పురుషులు, మహిళా బాక్సర్లు 40 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే పోటీపడటానికి అనుమతిస్తారు. 19ఏళ్ల నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు గల పురుషులు, మహిళా బాక్సర్లకు మాత్రమే ఎలైట్ లెవెల్ బాక్సర్లుగా ఉంటారు. ప్రస్తుతం మేరీ వయస్సు 41ఏళ్లు కావడంతో ఆమె ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన పరిస్థితి.