Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతారు

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డాన్ని చూస్తూనే ఉంటాం.

Viral Video : క్రికెట్ మ్యాచా.. కామెడీ షోనా.. వీడియో చూస్తే ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతారు

Comedy of errors three batters on the pitch video goes viral on Social Media

క్రికెట్‌లో అప్పుడ‌ప్పుడు కొన్ని స‌ర‌దా ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ఒకేసారి ముగ్గురు బ్యాట‌ర్లు క్రీజులో ఉన్న ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇది ఓ లీగ్ మ్యాచ్‌కు చెందినదిగా తెలుస్తోంది.

వీడియోలో ఏం ఉందంటే.?

బ్యాట‌ర్ మిడ్ వికెట్ వైపు బంతిని షాట్ ఆడాడు. రెండు ప‌రుగులు చేసేందుకు బ్యాట‌ర్లు ప్ర‌య‌త్నిస్తారు. ఈ క్ర‌మంలో ఓ బ్యాట్స్‌మెన్‌ను ర‌నౌట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. వికెట్ కీప‌ర్ బంతి అందుకుని వికెట్ల‌ను కొట్టేలోపు ఓ బ్యాట‌ర్ క్రీజులోకి రావ‌డంతో ర‌నౌట్ అవ‌కాశం మిస్ అవుతుంది. అదే స‌మ‌యంలో నాన్ స్ట్రైక‌ర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను సైతం అక్క‌డికి చేరుకున్నాడు. దీంతో నాన్‌స్టైకింగ్ ఎండ్‌లో ర‌నౌట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.

Ben Stokes : ఉపఖండంలో ఇదే గొప్ప విజయం.. ఉప్ప‌ల్‌లో గెలుపు పై ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌స్టోక్స్‌

దీన్ని గ‌మ‌నించిన ఫీల్డ‌ర్.. వికెట్ కీప‌ర్ కు చెప్ప‌గా అత‌డు బాల్‌ను మ‌రో ఫీల్డ‌ర్ అంద‌జేయ‌గా అత‌డు ఆ ఛాన్స్ మిస్ చేస్తాడు. ఇదిలా జ‌రుగుతూ ఉండ‌గా మూడో బ్యాట్స్‌మెన్ పిచ్ మ‌ధ్య‌కు వ‌స్తాడు. త‌న జ‌ట్టును ప‌రుగులు చేయ‌మ‌ని ప్రోత్స‌హిస్తాడు. ఆఖ‌రుకు ఇద్ద‌రు బ్యాట‌ర్లు అల‌స‌ట కార‌ణంగా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఆగిపోతారు. ఆ స‌మ‌యంలో వికెట్ కీప‌ర్ వికెట్‌ను ప‌డ‌గొట్ట‌డంతో ఓ బ్యాట‌ర్ ర‌నౌట్ అయ్యాడు.

మూడో బ్యాట‌ర్ ఎందుకు వ‌చ్చాడు..?

రెండో ప‌రుగు చేసే క్ర‌మంలో మొద‌టి బ్యాట‌ర్ ర‌నౌట్ అయ్యాడ‌ని భావించిన‌న మూడో బ్యాట‌ర్ అత‌డి స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వ‌చ్చాడు. అయితే.. ముందు బ్యాట‌ర్ నాటౌట్ అని మూడో బ్యాట‌ర్‌కి తెలిసింది. దీంతో త‌న జ‌ట్టును అద‌న‌పు ప‌రుగులు చేయ‌మ‌ని అక్క‌డే ఉండి ప్రోత్స‌హించ‌డం ప్రారంభిస్తాడు.

ఇది ఎప్పుడు, ఎక్క‌డ జ‌రిగిందో అన్న విష‌యాలు అయితే తెలియ‌వు గానీ.. ఈ వీడియో మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

WTC Points table : ఓట‌మి బాధ‌లో ఉన్న టీమ్ఇండియాకు భారీ షాక్‌.. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు..!