Pushpa 2 : శ్రీవల్లి తీసిన సుకుమార్ ఫొటోతో.. ‘పుష్ప 2’ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన టీం..

పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి.

Pushpa 2 : శ్రీవల్లి తీసిన సుకుమార్ ఫొటోతో.. ‘పుష్ప 2’ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన టీం..

Pushpa Movie Team gives Clarity on Pushpa 2 Release Date with Sukumar Photo from Shooting sets

Pushpa 2 : పుష్ప సినిమా పాన్ ఇండియా వైడ్ ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) కి నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ సినిమా సాంగ్స్, డైలాగ్స్ తగ్గేదేలే అంటూ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. రామోజీ ఫిలింసిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

ఇక పుష్ప 2 సినిమాని ఆగస్టు 15 పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. కానీ ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. తాజాగా రష్మిక(Rashmika Mandanna) పుష్ప 2 సెట్ లో సుకుమార్ ని ఫోటో తీసింది. షూటింగ్ గ్యాప్ లో ఓ సింహం బొమ్మపై సరదాగా చెయ్యి పెట్టి నవ్వుతున్న సుకుమార్(Sukumar) ని ఫోటో తీసి తన స్టోరీలో పోస్ట్ చేసింది రష్మిక.

Also Read : Chaari 111 Trailer : చారి 111 ట్రైలర్ చూశారా? దేశాన్ని కాపాడటానికి వచ్చేస్తున్న వెన్నెల కిషోర్..

ఇదే సుకుమార్ ఫోటోని పుష్ప అధికారిక ట్విట్టర్ లో షేర్ చేసి.. ఈ ఫోటో రష్మిక తీసిందని, షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుందని, 2024 ఆగస్టు 15 కి పుష్ప 2 రిలీజ్ అవుతుందని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ తో పుష్ప 2 వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 కోసం పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.