APRCET-2024 Notification : ఏపీఆర్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 20 నుంచే దరఖాస్తులు ప్రారంభం

APRCET Notification : పీహెచ్‌డీ ప్రవేశాల కోసం ఏపీఆర్ సెట్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నెల 20 నుంచి మార్చి 19, 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

APRCET-2024 Notification : ఏపీఆర్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల.. ఈ నెల 20 నుంచే దరఖాస్తులు ప్రారంభం

APRCET Notification Released Today

APRCET Notification :  ఏపీలోని వర్సిటీల్లో పీహెచ్‌డీలో చేరాలనుకుంటున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం.. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఫిబ్రవరి 15 (గురువారం) నాడు ఏపీఎస్‌సీహెచ్ఈ (APSCHE) తరపున యూనివర్శిటీల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు.

దీని ప్రకారం.. ఈ నెల 20 నుంచి మార్చి 19, 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎంట్రన్స్ టెస్టులో ఫలితాల ఆధారంగా ఏపీ రాష్ట్రంలోని యూనివర్శిటీల్లో పలు విభాగాల్లో పీహెచ్‌డీలో అడ్మిషన్ పొందవచ్చు.

Read Also : TS Polycet-2024 Notification : తెలంగాణ పాలిసెట్‌ 2024 నోటిఫికేషన్‌.. ఈరోజు నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?

అయితే, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏమైనా సవరణలు చేసుకోవచ్చు. వచ్చే ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 7 తేదీల మధ్య మాత్రమే దరఖాస్తులో సవరణలు చేసుకునే వెసులుబాటు ఉంది.

అనంతరం ఇదే నెలలో ఏపీఆర్‌సెట్ ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రవేశ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరుగనున్నాయి.

ఏపీఆర్‌సెట్ ప్రవేశానికి అర్హతలివే :

  • అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి.
  • రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు కనీస మార్కులు 50 శాతంగా ఉండాలి.
  • రాష్ట్ర స్థాయి పరీక్షను APSCHE తరపున ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం నిర్వహిస్తుంది.
  • పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు.

Read Also : IAS Dikshita Joshi Success Story : యూపీఎస్సీ కోచింగ్ లేకుండా మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ అధికారిణిగా దీక్షిత్ జోషి..!