Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు

టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు.

Ravichandran Ashwin : ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డు.. టెస్టుల్లో 500 వికెట్ల క్ల‌బ్‌లో చోటు

Ravichandran Ashwin take 500 wickets in tests

Ravichandran Ashwin : టీమ్ఇండియా సీనియ‌ర్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. రాజ్‌కోట్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ సాధించాడు. ఇంగ్లాండ్ ఓపెన‌ర్ జాక్ క్రాలీ(15)ని ఔట్ చేయ‌డం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. భార‌త్ త‌రుపున ఈ ఘ‌న‌త సాధించిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఓవ‌రాల్‌గా తొమ్మిదో ఆట‌గాడిగా నిలిచాడు.

టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో 800 వికెట్ల‌తో శ్రీలంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్‌, ఇంగ్లాండ్ వెట‌ర‌న్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్ లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

టెస్టు క్రికెట్‌లో 500 పైగా వికెట్లు తీసిన ఆట‌గాళ్లు వీరే..

ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ (శ్రీలంక‌) – 800 వికెట్లు
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708
జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్‌) – 696*
అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 619
స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) – 604
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563
కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ (వెస్టిండీస్‌) – 519
నాథ‌న్ ల‌య‌న్ (ఆస్ట్రేలియా) – 517*
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 500*

IND vs ENG : సున్నా నుంచి కాదు.. ఐదు ప‌రుగుల‌తో ఇన్నింగ్స్ మొద‌లు పెట్టిన ఇంగ్లాండ్.. ఎందుకో తెలుసా?

అతి తక్కువ బంతుల్లో 500 టెస్టు వికెట్లు తీసిన ఆట‌గాళ్లు..

టెస్టు క్రికెట్‌లో అతి త‌క్కువ బంతుల్లో 500 వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ ఆట‌గాడు మెక్‌గ్రాత్ మొద‌టి స్థానంలో ఉన్నాడు.

గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 25528 బంతులు
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 25714
జేమ్స్ అండ‌ర్స‌న్ (ఇంగ్లాండ్) – 28150
స్టువ‌ర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్‌) – 28430
కోర్ట్నీ ఆండ్రూ వాల్ష్ (వెస్టిండీస్‌) – 28833

అతి తక్కువ మ్యాచుల్లో టెస్టుల్లో 500 వికెట్లు..

టెస్టుల్లో అతి త‌క్కువ మ్యాచుల్లో 500 వికెట్లు తీసిన ఆట‌గాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక దిగ్గ‌జ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీ ధ‌ర‌న్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ముత్త‌య్య మురళీధరన్ (శ్రీలంక‌) – 87 మ్యాచులు
ర‌విచంద్ర‌న్ అశ్విన్ (భార‌త్‌) – 98
అనిల్ కుంబ్లే (భార‌త్‌) – 105
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 108
గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 110

HCA : మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన.. మ‌ద్యం సేవిస్తూ.. బండ బూతులు తిడుతూ..