Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లు.. ఇప్పుడే ట్రై చేయండి!

Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి వచ్చింది. కొత్తగా నాలుగు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ షార్ట్‌కట్స్ ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం.

Whatsapp New Shortcuts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. కొత్తగా 4 టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లు.. ఇప్పుడే ట్రై చేయండి!

WhatsApp adds four New text formatting options and using them is really simple

Whatsapp New Shortcuts : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. మెసేజింగ్ ప్లాట్‌ఫారం తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా వాట్సాప్ కొత్త ఫంక్షనాలిటీలను తీసుకొచ్చింది. వినియోగదారులకు ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ప్రత్యేకించి అధికారిక కమ్యూనికేషన్‌ల కోసం ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగిస్తుంటే.. మీ టెక్స్ట్‌లలో ఏదైనా విషయాన్ని హైలెట్ చేయొచ్చు. మీ మెసేజ్‌లలో బుల్లెట్, నంబర్, బ్లాక్ కోట్ లేదా ఇన్‌లైన్ కోడ్ చేసేలా నాలుగు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఆప్షన్లను ప్రకటించింది. వీటిని ఉపయోగించడానికి సాధారణ షార్ట్‌కట్స్ ఉపయోగించి చేయవచ్చు. ఇప్పటికే ఇప్పటికే బోల్డ్, స్ట్రైక్‌త్రూ, ఇటాలిక్, మోనోస్పేస్ షార్ట్‌కట్‌లు అందుబాటులో ఉండగా అదనంగా మరో నాలుగు వచ్చి చేరాయి.

కొత్త వాట్సాప్ షార్ట్‌కట్‌లు ఏంటి? ఎలా పని చేస్తాయంటే? :
వాట్సాప్ తమ యూజర్ల కోసం బుల్లెట్ లిస్టు, నంబర్ లిస్ట్, బ్లాక్ కోట్, ఇన్‌లైన్ కోడ్ అనే నాలుగు కొత్త ఫార్మాటింగ్ షార్ట్‌కట్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటినుంచి వాట్సాప్ ఆండ్రాయిడ్, వెబ్, ఐఓఎస్, మ్యాక్, డెస్క్‌టాప్ యాప్‌లోని వినియోగదారులందరూ ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇకపై లింక్ చేసిన డివైజ్‌ల్లో కూడా చాట్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు..!

ఈ షార్ట్‌కట్స్ ద్వారా చాట్‌లో టెక్స్ట్ కొత్త ఫార్మాట్ రూపంలో మార్చుకోవచ్చు. అయితే, పర్సనల్, గ్రూపు చాట్‌లలో సపోర్టుతో పాటు, ఛానెల్‌లలోని అడ్మిన్‌లకు కూడా ఫీచర్ అందుబాటులో ఉంటుంది. మీరు స్లాక్ యూజర్ అయితే.. స్లాక్‌లో మినహా ఈ ఫార్మాటింగ్ ఆప్షన్లను టెక్స్ట్ బార్‌కు పైభాగంలో ఉన్న ఐకాన్ లేదా షార్ట్‌కట్స్ రెండింటి ద్వారా ఎనేబుల్ చేసుకోవచ్చు.

బుల్లెట్ లిస్ట్ : ఫార్మాటింగ్ ఆప్షన్ల విషయానికి వస్తే.. మొదటిది బుల్లెట్ లిస్ట్ (Bulleted List). ఏదైనా టెక్స్ట్‌ను పాయింట్లలో బుల్లెట్ జాబితా మాదిరిగా మార్చుకోవచ్చు. మీరు బుల్లెట్ చేయాలనుకుంటున్న టెక్స్ట్ ముందు ‘-‘ ఐకాన్ టైప్ చేయండి. ఆ తర్వాత అది ఆటోమాటిక్‌గా బుల్లెట్ ఐకాన్‌గా మారుతుంది. అప్పుడు మీరు Shift+Enter చేస్తూనే ఉండాలి. అది ఆటోమాటిక్‌గా నెక్స్ట్ బుల్లెట్ పాయింట్‌ అవుతుంది. ఉదాహరణకు ‘-‘ ఐకాన్ టైప్ చేసి కొంచెం స్పేస్ ఇచ్చి ఆ తర్వాత టెక్స్ట్ రాయాలని గుర్తుంచుకోండి.

నంబర్‌డ్ లిస్ట్ : వాట్సాప్‌లో రెండో షార్ట్‌కట్.. నంబర్‌డ్ లిస్ట్ (Numbered List).. ఇది బుల్లెట్‌ లిస్టు మాదిరిగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడానికి, 1, 2 లేదా 3 సంఖ్యలను టైప్ చేయండి. ఆ తర్వాత స్పేస్ ఇచ్చి ఏదైనా టెక్స్ట్ టైప్ చేయండి. బుల్లెట్ జాబితా మాదిరిగానే ఇక్కడ Shift+Enter నొక్కండి. దాంతో అది నెక్స్ట్ నంబర్‌కి ఆటోమాటిక్‌గా లిస్టు అవుతుంది.

బ్లాక్ కోట్ : ఏదైనా ముఖ్యమైన టెక్స్ట్ హైలైట్ చేయడానికి లేదా మెసేజ్‌లలో ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి బ్లాక్ కోట్‌ (Block Quote)ని ఉపయోగించవచ్చు. మీరు > ఐకాన్ పక్కన కొంచెం స్పేస్‌ బార్ ఇచ్చి ఏదైనా టైప్ చేయాలి. అక్కడ మీకు బ్లాక్ కోట్ మాదిరిగా టెక్స్ట్ హైలెట్ అవుతుంది.

ఇన్‌లైన్ కోడ్  : ఈ షార్ట్‌కట్ నిర్దిష్ట సమాచారాన్ని మిగిలిన టెక్స్ట్ నుంచి ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది. ఈ షార్ట్‌కట్ కోసం ఉదాహరణకు.. `Look how I have used this text` టెక్స్ట్ చూడండి. ఈ రెండింటి కోడ్ మధ్య టెక్స్ట్ ఏదైనా రాయొచ్చు. అక్కడివరకు అది హైలెట్ అవుతుంది.

ఈ షార్ట్‌కట్‌లతో వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్‌లను ఫార్మాట్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి అధికారిక కమ్యూనికేషన్‌ల కోసం వాట్సాప్‌ని ఉపయోగిస్తే.. అవసరమైన చోట నోట్ చేసే ఫార్మాట్ చేయాలనుకున్నప్పుడు టెక్స్ట్‌లో కొంత భాగాన్ని హైలైట్ చేసి ఈ షార్ట్‌కట్‌లను అప్లయ్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా మీ వాట్సాప్ చాట్‌లో కొత్త షార్ట్‌కట్స్ ఎలా పనిచేస్తున్నాయో ఓసారి ట్రై చేయండి.

Read Also : WhatsApp New Feature : వాట్సప్‌‌లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్.. ఇకపై ప్రొఫైల్‌ ఫొటోలను స్క్రీన్‌‌షాట్‌ తీయడం కుదరదు!