Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. టెస్టుల్లో 4వేల ప‌రుగులు పూర్తి

టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్‌ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌.. టెస్టుల్లో 4వేల ప‌రుగులు పూర్తి

Rohit Sharma 4000 runs in Tests

Rohit Sharma 4000 runs in Tests : టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో 4000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. భార‌త క్రికెట‌ర్ల‌లో ఈ మైలురాయిని దాటిన 17వ క్రికెట్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అత్యంత వేగంగా ఈ మెలురాయిని చేరుకున్న 10వ ఆట‌గాడిగా ఘ‌న‌త సాధించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ తొలి స్థానంలో ఉన్నాడు. 79 ఇన్నింగ్స్‌ల్లో సెహ్వాగ్ నాలుగు వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.

2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటివరకు భారత్ తరఫున 58 మ్యాచ్‌లు ఆడాడు. 36 ఏళ్ల రోహిత్ 44 స‌గ‌టుతో 4004 ప‌రుగులు చేశాడు. ఇందులో 11 సెంచ‌రీలు, 16 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. కెరీర్ ఆరంభంలో టెస్టుల్లో మిడిల్ ఆర్డ‌ర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ 2019లో ఓపెన‌ర్‌గా ప్ర‌మోష‌న్ పొందాడు. అప్ప‌టి నుంచి టెస్టుల్లో సైతం త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

WPL 2024 : డ‌బ్ల్యూపీఎల్‌లో విషాదం.. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే.. ప్రముఖ స్పోర్ట్స్ కెమెరామెన్ తిరువల్లువన్ కన్నుమూత

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రాంచీ టెస్టులో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 353 ప‌రుగుల‌కు ఆలౌటైంది. టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 307 ప‌రుగులు చేసింది. ధ్రువ్ జురెల్ (90), య‌శ‌స్వి జైస్వాల్ (73) హాఫ్ సెంచ‌రీలు చేశారు. ఇంగ్లాండ్‌కు కీల‌కమైన 46 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 145 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. అశ్విన్ ఐదు వికెట్ల‌తో చెల‌రేగగా, కుల్దీప్ నాలుగు వికెట్లు తీశాడు. జ‌డేజా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు. ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో జాక్ క్రాలీ (60) రాణించాడు. ఆ త‌రువాత 192 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్ట‌పోకుండా 40 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ (24), య‌శ‌స్వి జైస్వాల్ (16) లు క్రీజులో ఉన్నారు. భార‌త విజ‌యానికి ఇంకా 152 ప‌రుగులు అవస‌రం.

Sunil Gavaskar : టీమ్ఇండియాకు మ‌రో ధోనీ దొరికాడు