Neil Wagner : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ బౌలర్

నీల్ వాగ్నర్ 64 టెస్టుల్లో 260 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్ లో 73 పరుగులకు 9 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన.

Neil Wagner : అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ బౌలర్

Neil Wagner

Neil Wagner Retires : న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ నీల్ వాగ్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 37ఏళ్ల వాగ్నర్ న్యూజిలాండ్ తరపున చాలా సందర్భాల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఐసీసీ వెబ్ సైట్ లో ప్రచురించిన కథనం ప్రకారం.. వాగ్నర్ మాట్లాడుతూ ఈ వారం చాలా ఎమోషనల్ గా గడిచింది. మీరు చాలాకాలంగా అనుబధం ఉన్నదానినుంచి సులభంగా దూరంగా ఉండలేరు. న్యూజిలాండ్ తరపున క్రికెట్ ఆడుతున్నప్పుడు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. నేను నా భార్య లానాకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.. ఆమె నాకు చాలా సపోర్ట్ ఇచ్చిందంటూ నీల్ వాగ్నర్ పేర్కొన్నారు.

Also Read : Mohammed Shami : ఆస్పత్రిలో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ .. ఏమైందో తెలుసా?

వాగ్నర్ 64 టెస్టుల్లో 260 వికెట్లు పడగొట్టాడు. ఒక మ్యాచ్ లో 73 పరుగులకు 9 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శన. బ్యాటింగ్ లోనూ అద్భుతంగా రాణించాడు. వాగ్నర్ 84 ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసి 874 పరుగులు చేశాడు. అందులో ఒక హాప్ సెంచరీ కూడా ఉంది. వాగ్నర్ ఇండియాపై అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 2014లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ ఆక్లాండ్ లో జరిగింది. న్యూజిలాండ్ బౌలర్ వాగ్నర్ ఆ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లోనూ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఈ టెస్టులో మొత్తం 8 వికెట్లను వాగ్నర్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Also Read : Rohit Sharma : ఆ ఘ‌నత సాధించిన తొలి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌నే..