Aha Naa Pellanta Web Series : పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్.. టీవీలో ఫుల్ మూవీగా వస్తోంది!

Aha Naa Pellanta Web Series : జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’ సినిమాగా ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ సినిమాలులో ప్రసారం కానుంది.

Aha Naa Pellanta Web Series : పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్.. టీవీలో ఫుల్ మూవీగా వస్తోంది!

Raj Tarun Aha Naa Pellanta Web Series to be telecasted in Zee Cinemas on february 29th

Aha Naa Pellanta Web Series : టాలీవుడ్ యువహీరో రాజ్ తరుణ్ నటించిన పక్యా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ ఇప్పుడు టీవీల్లో ప్రసారం కానుంది. ఫిబ్రవరి 29న టీవీ ప్రేక్షకుల కోసం వెబ్ సిరీస్ అన్ని ఎపిసోడ్లను కలిపి ఫుల్ మూవీగా జీ సినిమాస్‌లో టెలిక్యాస్ట్ కానుంది.

Read Also : Chandini Chowdary : సరికొత్తగా చిత్రకారుడితో టైటిల్ లాంచ్.. చాందిని చౌదరి కొత్త సినిమా ‘యేవమ్’..

సరికొత్త సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అమితంగా అలరిస్తున్న జీ సినిమాలు, జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ మొత్తం సీజన్ సినిమాగా అందించనుంది. ఇటీవల ఓటీటీ జీ5లో అహ నా పెళ్లంట వెబ్ సిరీస్ అత్యధికంగా వీక్షించారు. ఈసారి బుల్లితెర టీవీ ప్రేక్షకుల కోసం ఈ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మీ జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది.

ఊహించని ట్విస్టులతో..  :
అహ నా పెళ్లంట.. ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన స్టోరీ.. అన్ని ట్విస్టులతోనే కొనసాగుతుంటుంది. ఈ సిరీస్ స్టోరీ మొత్తం శీను హీరో (రాజ్ తరుణ్) చుట్టూనే తిరుగుతుంది. స్కూల్లో జరిగిన ఒక సంఘటన కారణంగా అతడు తన జీవితంలో ఏ అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు. అనుకోకుండా మహా(శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి రావడంతో ఊహంచని ట్విస్ట్‌తో స్టోరీ మొత్తాన్ని మలుపు తిప్పుతుంది.

అసలు కథేంటి?
స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి? శీను ఏం చేశాడు? శీను జీవితంలోకి వచ్చిన మహా అతడి జీవితాన్ని ఎలా మారుస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు దొరకాలంటే జీ సినిమాలులో ఫుల్ మూవీగా ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ తప్పక చూడాల్సిందే. జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంటలో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ సినీయర్ నటి ఆమని నటించింది. అలాగే, నటుడు హర్షవర్ధన్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. భావోద్వేగాలతో నడిచే ఈ మూవీని సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేశారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఫిబ్రవరి 29న బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : Game Changer : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి బిగ్ అప్డేట్..