Jai Hanuman : ‘జై హనుమాన్’ అప్డేట్.. ‘హనుమాన్’ 50 డేస్ సెలబ్రేషన్స్.. హనుమంతుడి స్పెషల్ విగ్రహం..
నేడు హనుమాన్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..
![Jai Hanuman : ‘జై హనుమాన్’ అప్డేట్.. ‘హనుమాన్’ 50 డేస్ సెలబ్రేషన్స్.. హనుమంతుడి స్పెషల్ విగ్రహం.. Jai Hanuman : ‘జై హనుమాన్’ అప్డేట్.. ‘హనుమాన్’ 50 డేస్ సెలబ్రేషన్స్.. హనుమంతుడి స్పెషల్ విగ్రహం..](https://10tv.in/wp-content/uploads/2024/03/hanuman-success.jpg)
Prashanth Varma gives Jai Hanuman Update in Hanuman Movie 50 Days Success Celebrations
Jai Hanuman Update : తేజ సజ్జ(Teja Sajja), ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ‘హనుమాన్’ సినిమా సంక్రాతికి వచ్చి నిన్నటితో 50 డేస్ పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో 50 రోజులు ఆడటం అంటే చాలా గొప్ప. హనుమాన్ సినిమా ఏకంగా 150 సెంటర్స్ లో 50 రోజులు ఆడటం గమనార్హం. దీంతో హనుమాన్ సినిమా 50 డేస్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఇక హనుమాన్ సినిమాని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కించారని, దీనికి సీక్వెల్స్ కూడా రాబోతున్నాయని ఆల్రెడీ ప్రకటించారు. నేడు సక్సెస్ సెలబ్రేషన్స్ లో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. 50 డేస్ సెలబ్రేషన్స్ చూసి చాలా రోజులైంది. నా హనుమాన్ సినిమాకి జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా సక్సెస్ నా ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ కి బాగా హెల్ప్ అయింది. వీలైనంత త్వరగా నెక్స్ట్ సినిమాలు తీసుకొస్తాము అంటూ తెలిపారు. అలాగే స్పెయిన్, జపాన్, చైనాలో హనుమాన్ సినిమాని త్వరలో రిలీజ్ చేయబోతున్నాము అని తెలిపారు.
Also Read : Janhvi Kapoor : రిహన్నతో జాన్వీ కపూర్ డ్యాన్స్ మాములుగా లేదుగా.. వైరల్ అవుతున్న వీడియో..
ఇక హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ సినిమా గురించి మాట్లాడుతూ.. జై హనుమాన్ వర్క్ ఆల్రెడీ మొదలైంది. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాము. హనుమాన్ సినిమాలో మీకు నచ్చిన క్లైమాక్స్ జై హనుమాన్ లో రెండు గంటల పాటు ఉండబోతుంది అని అప్డేట్ ఇచ్చారు. దీంతో ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ వర్మ చెప్పినట్టు జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఏప్రిల్ లో శ్రీరామ నవమి లేదా హనుమాన్ జయంతి రోజు ఇవ్వొచ్చు అని సమాచారం.
ఇక ఈ సెలబ్రేషన్స్ లో షీల్డ్స్ గా హనుమంతుడి విగ్రహాన్ని స్పెషల్ గా చెన్నైలో చేయించి తెప్పించారని సమాచారం. దీంతో ఈ చిన్ని హనుమంతుడి విగ్రహం కూడా వైరల్ గా మారింది.