Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్.. అక్కడి నుంచి పోటీ

ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేఏ పాల్.

Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబూ మోహన్.. అక్కడి నుంచి పోటీ

Babu Mohan

Babu Mohan: సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేఏ పాల్. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి బాబూ మోహన్‌ పోటీ చేస్తారని కేఏ పాల్‌ తెలిపారు. ఇటీవలే బాబూ మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ బీజేపీ పెద్దల వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బాబూ మోహన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు ఆయనకు అందోల్ నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దామోదర రాజనరసింహ గెలిచారు. బాబూ మోహన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు.

బాబూ మోహన్ 2014లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. 2018లో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. 1990 దశకం నుంచి 2014 వరకు బాబూ మోహన్ తెలుగు దేశం పార్టీలో పనిచేశారు. 1999లో టీడీపీ నుంచి పోటీచేసి అందోల్‌లో గెలుపొందారు.

లోక్‌సభ ఎన్నికల ముందు ఇప్పుడు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరడం గమనార్హం. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

Read Also : సచివాలయం తాకట్టు పెట్టారన్న చంద్రబాబు వ్యాఖ్యలకు కొండాలి నాని స్ట్రాంగ్ కౌంటర్