Reliance Jio : జియో తెలంగాణలో ఘనంగా 53వ జాతీయ భద్రతా వారోత్సవాలు

Reliance Jio Telangana : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తెలంగాణ రాష్ట్రంలోని ఆఫీసు బ్రాంచుల్లో 53వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది.

Reliance Jio : జియో తెలంగాణలో ఘనంగా 53వ జాతీయ భద్రతా వారోత్సవాలు

Reliance Jio Telangana celebrates 53th National Safety Week across State

Reliance Jio Telangana : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తెలంగాణ రాష్ట్రంలోని ఆఫీసు బ్రాంచుల్లో 53వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. తమ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో జియో మార్చి 4 నుంచి 10 వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తోంది. సంవత్సరం పొడవునా సురక్షితంగా పనిచేయాలని, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత (OH&S)పై అవగాహన పెంచడంలో భాగంగా జియో ఈ తరహా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Read Also : Salman Khan : సల్మాన్ ఖాన్ సీక్రెట్స్ బయటపెట్టిన చిన్ననాటి స్నేహితుడు..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్కింగ్ ఆఫీసుల్లో సేఫ్టీ వీక్‌లో భాగంగా వివిధ భద్రతా అవగాహన కార్యక్రమాలను, పోటీలను కంపెనీ నిర్వహిస్తోంది. ఈ కార్యకలాపాలలో జియో కార్మికులకు నిర్మాణ సామగ్రి, మిషన్లు, డివైజ్‌లను సేఫ్‌గా ఉంచుకోవడంపై ప్రత్యేక ప్రదర్శన సెషన్‌లు, మాక్-డ్రిల్ ట్రైనింగ్ వంటివి నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జియో బృందం సభ్యులు వర్కింగ్ ప్లేసుల్లో ప్రమాదాలను నివారించడానికి అనుసరించాల్సిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌లపై అవగాహన పెంచుతామని ప్రతిజ్ఞ చేశారు.

నియంత్రణ చర్యలు, కట్టుదిట్టమైన భద్రతా నియమాల అమలుపై రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది సెక్యూరిటీ థీమ్ ‘ఫోకస్ ఆన్ సేఫ్టీ లీడర్ షిప్ ఫర్ ఈఎస్‌జీ ఎక్స్‌లెన్స్’ స్వాగతించి ఆచరణలో పెట్టడానికి జియో తెలంగాణ ఉత్సాహంతో ముందుకు వచ్చింది.

కార్మికులను భద్రతా ప్రమాణాలు పాటించేలా ప్రేరేపించడం, ఉద్యోగుల మధ్య ఆరోగ్యకరమైన పోటీని సృష్టించడమే జియో లక్ష్యాలలో ఒకటిగా పేర్కొంది. జియో నెట్‌వర్క్, ఆపరేషన్, మెయింటెనెన్స్, హెచ్‌ఎస్‌ఇ సభ్యుల ఆధ్వర్యంలో భద్రతా అవగాహన సెషన్‌లు, జెండా వందనాలు, భద్రతా ప్రతిజ్ఞ, భద్రతా బ్యాడ్జ్, బ్యానర్, పోస్టర్ డిస్‌ప్లే, భద్రతా అవగాహనపై ర్యాలీ‌లను కూడా నిర్వహిస్తున్నారు.

Read Also : Indira Kranthi Scheme : మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్.. 12 నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం