బీజేపీ ప్లాన్ అదుర్స్ కదూ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోపే ఏమేం సాధించిందో తెలుసా?

BJP: ఒంటరిగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిరాష్ట్రంలో కాషాయ ప్రభుత్వాలు ఉండాలనేది బీజేపీ లక్ష్యం.

బీజేపీ ప్లాన్ అదుర్స్ కదూ.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోపే ఏమేం సాధించిందో తెలుసా?

BJP

బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్, ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్, దేవెగౌడ నేతృత్వంలోని కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్, ఎన్‌డిఎలోకి తిరిగి వచ్చాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి మిత్రులను చేరదీస్తోంది బీజేపీ. ఏపీలో టీడీపీతో మళ్లీ కలిసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలోపే కూటమిని బలోపేతం చేసుకోవడంతో ఎన్నో సాధించింది.

బీహార్‌లో బీజేపీ తొలి విజయం సాధించింది. ప్రతిపక్షాల ఐక్యతకు రూట్ మ్యాప్ రెడీ చేసిన నితీశ్ కుమార్ పార్టీ JDU విపక్ష కూటమికి దూరమై తిరిగి NDAలోకి వచ్చింది. యూపీలో, పశ్చిమ యూపీ రాజకీయాలపై మంచి ప్రభావం చూపిన ఆర్‌ఎల్‌డీ కూడా ఎన్డీయేలో చేరగా, కర్ణాటకలో జేడీఎస్‌ను ఏకతాటిపైకి తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయింది.

ఎన్డీయే నుంచి వైదొలిగిన పార్టీలు తిరిగి వస్తున్నట్లే పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ పునరాగమనంపై చర్చ సాగుతోంది. కలసి వచ్చే పార్టీలతో 2024 ఎన్నికలను ఫేస్ చేయాలని భావిస్తోంది బీజేపీ. అయితే ఎలాగు ఎన్నికలున్నాయ్. కాబట్టి మిత్రపక్షాలు పెట్టే షరతులకు మాత్రం అంగీకరించడం లేదు. తాము చెప్పినట్లు వింటేనే కూటమిలో చేర్చుకుంటున్నారు కమలనాథులు.

యూపీ నుంచి ఆపరేషన్ షురూ
యూపీ నుంచి ఆపరేషన్ మొదలు పెట్టుకుంటూ వచ్చింది బీజేపీ. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్నా దళ్ ఎస్ తో పొత్తు పెట్టుకుంది బీజేపీ. 2019లో నిషాద్ పార్టీ మద్దతు కూడా తీసుకుంది. నెమ్మదిగా యూపీలో పూర్తిస్థాయి పట్టుసాధించింది బీజేపీ. మెజార్టీ ఓటర్లైనా ముస్లింలను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు కమలనాథులు.

మహారాష్ట్రంలో గతంలోనే కొత్త పొత్తులకు తెరదీసింది బీజేపీ. ఏకంగా శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీని చీల్సి..అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతోంది. అంతకముందు శివసేన నుంచి షిండే వర్గాన్ని వేరు చేయడంలోనూ కమలం పార్టీ ఎత్తులు ఫలించాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఆధ్వర్యంలో తిరుగులేని కూటమి తయారైంది.

ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకుంది. త్రిపురలో రెండోసారి అధికారం చేపట్టింది. నాగాలాండ్‌లో మిత్రపక్షంతో కలిసి అధికారాన్ని పంచుకుంది. మణిపూర్ లోనూ నాగా పీపుల్స్ ఫ్రంట్ అండ్ లోక్ జనశక్తి పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అస్సాంలోనూ పాగా వేసింది కమలం పార్టీ. అరుణాచల్ ప్రదేశ్ లోనూ 2016లో కాషాయ వికసించింది.

నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తోంది బీజేపీ. సొంతంగా బలపడే చోట సొంతంగా.. పరిస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవనుకున్న చోట మిత్రపక్షాలతో కలిసి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు కమలనాథులు. ఒంటరిగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిరాష్ట్రంలో కాషాయ ప్రభుత్వాలు ఉండాలనేది బీజేపీ లక్ష్యం.

దీర్ఘకాలిక ప్రణాళికలతో
దీర్ఘకాలిక ప్రణాళికలతో.. పార్టీ బలహీనంగా ఉన్నచోట పొత్తులతో తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు కమలం పార్టీ లీడర్లు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ స్వతహాగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కనీసం పట్టులేదనున్న త్రిపుర లాంటి రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. గెలుపైనా, ఓటమైనా.. కమలం పార్టీ ప్రతి ఎన్నిక నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటుంది. ప్రతి రాష్ట్రంలో తమ ఓటు షేర్ పెంచుకుంటూ వస్తోంది బీజేపీ.

పొత్తులు పలు రాష్ట్రాల్లో బీజేపీని బలహీనం చేశాయనేది మోదీ, అమిత్ షా అంచనా. అందుకే పొత్తు ధర్మం పాటిస్తూనే.. తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తంటే అధికారంలోకి రావడం కోసమే కాదు..తమ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా.. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు, క్యాడర్ నిరుత్సాహ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కమలనాథులు.

కేంద్రంలో అధికారం కోసం మిత్రపక్షాలు పట్టుబట్టినట్లు సీట్లు ఇచ్చుకుంటూ పోతే తాము నష్టపోతున్నామని భావిస్తున్నారు. అందుకే ఎన్డీయేలో చేరాలంటే షరతులు వర్తిస్తాయంటున్నారు బీజేపీ లీడర్లు.

AP Politics : అనంతపురం జిల్లా టీడీపీలో తీవ్రమవుతున్న టికెట్ల గొడవ.. శ్రీరామ్ వర్గీయుల ఆందోళన