Tollywood New Movies : టాలీవుడ్ కొత్త సినిమాల స్టోరీ లైన్స్ చెబుతూ.. అమెజాన్ ప్రైమ్ పోస్టులు వైరల్..

ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కానీ సినిమాల స్టోరీ లైన్స్ ని తెలియజేసేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో. ఉస్తాద్ భగత్ సింగ్,కంగువ, గేమ్ ఛేంజర్, కాంతార 2..

Tollywood New Movies : టాలీవుడ్ కొత్త సినిమాల స్టోరీ లైన్స్ చెబుతూ.. అమెజాన్ ప్రైమ్ పోస్టులు వైరల్..

Amazon Prime Video reveals tollywood un released movies story line

Tollywood New Movies : అమెజాన్ ప్రైమ్ వీడియో నేడు టాలీవుడ్ టు బాలీవుడ్ మేకర్స్ తో ముంబైలో ఓ ఈవెంట్ ని నిర్వహించింది. ఇక ఈ కార్యక్రమంలో తమ కొత్త ప్రాజెక్ట్స్ ని, అలాగే తమ ఓటీటీలో రిలీజ్ కాబోయే కొత్త వెబ్ సిరీస్, సినిమాలను అనౌన్స్ చేసింది. ఈక్రమంలోనే ఇంకా థియేటర్స్ లో రిలీజ్ కానీ సినిమాల స్టోరీ లైన్స్ ని తెలియజేసింది. ఆ న్యూ మూవీస్, వాటి స్టోరీ లైన్స్ వైపు ఓ లుక్ వేసేయండి.

ఉస్తాద్ భగత్ సింగ్..
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం.. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. ఈ చిత్రంలో పవన్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. సమాజంలోని అవినీతి పై ఈ పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటమే మూవీ స్టోరీ లైన్.

గేమ్ ఛేంజర్..
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమాలో రామ్ చరణ్ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. అవినీతి లీడర్స్ ని ఎదుర్కొంటూ, ఎలక్షన్స్ ని రూల్స్ కి తగ్గట్టు నిర్వర్తిస్తూ ఎలాంటి గేమ్ ఆడాడు అనేది స్టోరీ లైన్.

కాంతార 2..
రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ మూవీకి ప్రీక్వెల్ గా వస్తున్న చిత్రం కాంతార 2. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విలాస కోరికల కంటే గొప్ప విపత్తు ఏది ఉండదు. అలాంటి విలాసానికి అలవాటుపడ్డ ఒక రాజు చేసిన పనులకు.. ఒక ఆదివాసీ నాయకుడి గుండెల్లో ఆవేశాన్ని రేకెత్తిస్తుంది. ఆ ఆదివాసీ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అయితే.. ఆ కథ ఎలా ఉండబోతుందో అనేది కాంతార 2.

హరి హర వీరమల్లు..
పవన్ మొదటిసారి వారియర్ గా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ మూవీ స్టోరీ అంతా మొఘలుల కాలంలో సాగుతుంది. మొఘలుల పాలన పై తిరగబడ్డ వీరుడిగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

కంగువ..
సూర్య నటిస్తున్న హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘కంగువ’. శివ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కథ.. మొత్తం 500 ఏళ్ళకి సంబంధించిందట. 1700 నుంచి మొదలయ్యి 2023 వరకు ఈ స్టోరీ లైన్ ఉంటుందట. పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక పనిని పూర్తి చేయడం కోసం హీరో చేసే టైం ట్రావెల్ కథే.. సినిమా స్టోరీ లైన్.

ఫ్యామిలీ స్టార్..
గీతగోవిందం డైరెక్టర్ పరుశురాం, హీరో విజయ్ దేవరకొండ మరోసారి కలిసి చేస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో విజయ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా కనిపించబోతున్నారు. మధ్యతరగతి కుటుంబంలో ఎదురయ్యే ఛాలెంజ్స్ ని ఎదుర్కొంటూ తన ఎలా సక్సెస్ అయ్యాడు అనేది కథ.

తమ్ముడు..
నితిన్, వేణుశ్రీరాం కాంబినేషన్ రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. సిస్టర్ సెంటిమెంట్ తో ఈ చిత్రం తెరకెక్కబోతుందట. తన అక్కని కాపాడుకోవడం కోసం తమ్ముడు చేసే పోరాటమే.. ఈ మూవీ స్టోరీ లైన్.