Mahi V Raghav : ఓటీటీలో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టిన డైరెక్టర్.. ఫుల్ ఫామ్ లో ఉన్నాడుగా..

యాత్ర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మహి వి.రాఘవ్ సినిమాలతోనే కాదు ఓటీటీలో కూడా..

Mahi V Raghav : ఓటీటీలో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టిన డైరెక్టర్.. ఫుల్ ఫామ్ లో ఉన్నాడుగా..

Tollywood director mahi v raghav

Mahi V Raghav : యాత్ర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ మహి వి.రాఘవ్ సినిమాలతోనే కాదు ఓటీటీలో సిరీస్ లతో కూడా హిట్స్ కొడుతున్నాడు. మహి వి.రాఘవ్ రచయితగా, షో రన్నర్ గా, నిర్మాతగా డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మొదట ‘సేవ్ ది టైగర్స్’ కామెడీ సిరీస్ తో వచ్చి సక్సెస్ అయ్యాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సేవ్ ది టైగెర్స్ సిరీస్ మంచి హిట్ అయింది.

ఆ తర్వాత సైతాన్ అనే బోల్డ్ క్రైం థ్రిల్లర్ కంటెంట్ తో అదే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చి హిట్ కొట్టాడు. ఈ సిరీస్ కి దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. ఇప్పుడు సూపర్ హిట్ అయిన సేవ్ ది టైగర్స్ సీజన్ కి సీక్వెల్ సీజన్ 2 తీయగా అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇటీవలే సేవ్ ది టైగెర్స్ సీజన్ 2 మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ అవ్వగా వారం రోజుల్లోనే మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకొని ప్రేక్షకులని ఫుల్ గా నవ్వించింది.

Also read : Sai Pallavi : ‘తండేల్’ షూట్ నుంచి ఫొటోలు.. సాయి పల్లవి ఒళ్ళో పాపతో క్యూట్ గా..

సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సైతాన్, సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. ఇలా మూడు సిరీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అవ్వడంతో మహి వి.రాఘవ్ ఓటీటీలో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. అది కూడా మూడు సిరీస్ లు ఒకే ఓటీటీలో కావడం విశేషం. నిర్మాతగా, రచయితగా, షో రన్నర్ గా, దర్శకుడిగా మహి వి.రాఘవ్ ఈ సిరీస్ లతో మరోసారి సక్సెస్ అయ్యాడు.

దీనిపై మహి వి.రాఘవ్ స్పందిస్తూ.. మన చుట్టూ రోజు జరిగే సన్నివేశాలని, భార్య భర్తల మధ్య జరిగే సంఘటనలతోనే సేవ్ ది టైగెర్స్ సిరీస్ చేసాము. ఎంటర్టైన్మెంట్ కి తగ్గ నటీనటులు దొరకడంతో ఇంకా బాగా సక్సెస్ అయింది. త్వరలో మా త్రీ ఆటమ్ లీవ్స్ నిర్మాణ సంస్థ నుంచి మరింతమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చి కొత్త వెబ్ సిరీస్ లను తీసుకొస్తాము అని తెలిపారు.