Janhvi Kapoor : తిరుపతి కొండపై ప్రియుడితో.. మావిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ..

తిరుపతి కొండపై ప్రియుడి శిఖర్‌ పహారియాతో మావిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ కపూర్. అలాగే ఆమె పిన్ని ఇంటిలో నెయ్యి వేసుకొని..

Janhvi Kapoor : తిరుపతి కొండపై ప్రియుడితో.. మావిడికాయలు తింటూ ఎంజాయ్ చేస్తున్న జాన్వీ..

RC16 Devara Actress Janhvi Kapoor with her boyfriend Shikhar Pahariya

Janhvi Kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ‘ఆర్ఆర్ఆర్’ హీరోల సినిమాలతో సౌత్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. కాగా ఇటీవల ఈ భామ తన పుట్టినరోజు నాడు ప్రియుడు శిఖర్‌ పహారియాతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరితో పాటు బాలీవుడ్ సోషల్ మీడియా స్టార్ ఒర్రి, ఒకప్పటి హీరోయిన్ మహేశ్వరితో మరికొంతమంది కుటుంబసభ్యులు కూడా వచ్చారు.

ఆరోజు వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొన్ని నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఒర్రి తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మొత్తం వీరి ప్రయాణాన్ని అంతా ఒక బ్లాగ్ వీడియోగా రూపొందించారు. చెన్నైలో మహేశ్వరీ ఇంటిలో వీరి వీడియో బ్లాగ్ మొదలయింది. అక్కడ జాన్వీ.. అన్నం మొత్తం నెయ్యి వేసుకొని తింటున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి.

Also read : Mahi V Raghav : ఓటీటీలో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టిన డైరెక్టర్.. ఫుల్ ఫామ్ లో ఉన్నాడుగా..

ఆ తరువాత తిరుమల కొండని నడక దారిలో ఎక్కారు. దారిలో తోటి ప్రయాణికులైన ఆడియన్స్ కి జాన్వీ సెల్ఫీలు ఇస్తూనే ముందుకు సాగారు. ఇక శ్రీవారి మెట్లు ఎక్కడానికి మొత్తం అందరూ చాలా కష్టపడినట్లు కనిపిస్తుంది. ఇక దారి మద్యలో ఉన్న స్నాక్స్ ని కూడా తింటూ ముందుకు సాగారు. ఈక్రమంలోనే జాన్వీ మావిడికాయని తింటుంటే.. ఆమె ప్రియుడు శిఖర్‌ పహారియా జాన్వీ నుంచి ఆ కాయని లాకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా జాన్వీ కపూర్, ఎన్టీఆర్ తో ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. రామ్ చరణ్ తో ‘RC16’లో చేస్తున్నారు. ఆల్రెడీ దేవర షూటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు చేరుకుంది. ఇక ఇటీవలే లాంచ్ అయిన RC16 మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గానే వస్తున్నాయి.