ఆయన గురించి మాట్లాడాలంటేనే సిగ్గనిపిస్తోంది: పద్మారావు గౌడ్

Padma Rao Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసింది ఏమీలేదని విమర్శించారు.

ఆయన గురించి మాట్లాడాలంటేనే సిగ్గనిపిస్తోంది: పద్మారావు గౌడ్

padmarao

తాను ఓ ఎమ్మెల్యేనని, తన ఇంట్లో కూడా కరెంట్ పోతోందని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోలేదని, ఇప్పుడు పోతోందని చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీనివాస్ యాదవ్,పద్మారావు గౌడ్ అంటే గుర్తుపట్టని గ్రేటర్ ప్రజలు ఎవరూ ఉండరని చెప్పారు.

దానం నాగేందర్ గురించి మాట్లాడాలంటే సిగ్గు అనిపిస్తుందని, ఆయన ఎప్పుడూ పార్టీ మారుతూనే ఉంటారని చెప్పారు. ఖైరతాబాద్ ప్రజలు చైతన్యవంతులని గతంలో ఆయనను ఓడగొట్టారని తెలిపారు. తమ స్వయంకృషి, ప్రజలకు సేవచేయడంతో ఆ పేరు వచ్చిందని పద్మారావు గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తనను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించగానే ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తమ పార్టీకి డైనమిక్ ఎమ్మేల్యేలు ఉన్నారని తెలిపారు.

ప్రజలే తమ కుటుంబంగా భావిస్తూ వారినే ఎప్పుడూ నమ్ముకున్నామని పద్మారావు గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసింది ఏమీలేదని విమర్శించారు. సికింద్రాబాద్ అంతా తన ఇల్లు అని పద్మారావు గౌడ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని పద్మారావు గౌడ్ అన్నారు.

బీఆర్ఎస్ సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను ప్రకటించగానే ప్రజల్లో మంచి స్పందన వచ్చిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లుండి సికింద్రాబాద్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తామని, ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు.

తాడేపల్లిగూడెంలో జనసేనకు మద్దతు తెలిపిన సినీహీరో సుమన్