కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. ఆయన తరఫు న్యాయవాది ఏం చెప్పారో తెలుసా?

నాలుగో దశలో ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చిన వారికి ఎలాంటి అభ్యంతరం లేకుండా బెయిల్ ఇచ్చారని సింఘ్వి చెప్పారు.

కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఢిల్లీ హైకోర్టులో విచారణ.. ఆయన తరఫు న్యాయవాది ఏం చెప్పారో తెలుసా?

Delhi CM Arvind Kejriwal

సీఎం కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్, కస్టడీపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం వాదనలు వింటోంది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.

ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ సరికాదని అన్నారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేని పరిస్థితి నెలకొందని సింఘ్వి చెప్పారు. ఎన్నికలకు ముందే పార్టీని కూల్చివేయడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గత ఏడాది అక్టోబర్ 30 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకు 9 సార్లు కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారని చెప్పారు.

పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం కేజ్రీవాల్ స్టేట్ మెంట్ రికార్డు చేయలేదని అభ్యంతరాలు సింఘ్వి తెలిపారు. ఈడీ విచారణకు హాజరుకాలేదని కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయన అరెస్ట్ మ్యాచ్ ఫిక్స్ లాంటిదని తెలిపారు. వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేయడం పనికిరాని చర్యని చెప్పారు.

మాగుంట రాఘవ, శరత్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులురెడ్డి మొదట కేజ్రీవాల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని సింఘ్వి తెలిపారు. రెండో దశలో కొందరిని అరెస్టు చేశారని చెప్పారు. మూడో దశలో నిందితులు మొదటిసారి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు.

నాలుగో దశలో ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చిన వారికి ఎలాంటి అభ్యంతరం లేకుండా బెయిల్ ఇచ్చారని సింఘ్వి చెప్పారు. ఆ తర్వాత అప్రూవర్లుగా మారారని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారని చెప్పారు. ఈడీ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు.

ఈడీ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని సింఘ్వి చెప్పారు. బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేయలేదని, అయితే ఆయన స్టేట్ మెంట్ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. సి.అరవింద్ ఇచ్చిన స్టేట్ మెంట్ షాక్ కు గురిచేస్తోందని చెప్పారు. ఈడీ పీఎంఎల్ఏ సెక్షన్ 50ని ప్రాతిపదికగా తీసుకుంటుందని, అయితే, రెండేళ్లుగా ఏమీ కనుగొనలేదని తెలిపారు.

Also Read: వయనాడ్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ