Dil Raju : సినిమా రివ్యూలపై కేరళ కోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్కడ కూడా తీసుకు రావాలంటున్న దిల్ రాజు..

సినిమా రివ్యూలపై కేరళ కోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ కూడా తీసుకు రావాలంటున్న దిల్ రాజు. ఇంతకీ ఏంటి ఆ తీర్పు..

Dil Raju : సినిమా రివ్యూలపై కేరళ కోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్కడ కూడా తీసుకు రావాలంటున్న దిల్ రాజు..

Dil Raju comments about kerala court judgement on cinema reviews

Dil Raju : పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు. సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ అండ్ టీజర్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నాయి. ఇక థియేటర్స్ లో రిలీజైన సినిమా కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది. కానీ కొంతమంది ఈ చిత్రానికి కావాలని నెగటివ్ రివ్యూలు ఇస్తూ సినిమాకి నష్టం కలిగిస్తున్నారు.

మొదటి షో నుంచే ఈ మూవీ పై నెగిటివిటీ వ్యాప్తి చేస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. యూట్యూబ్ లో కూడా సినిమా బాగోలేదంటూ రివ్యూలు ఇస్తూ సినిమాకి వెళ్దాం అనుకుంటున్న ఆడియన్స్ మైండ్ సెట్ ని కూడా మార్చేస్తున్నారు. ఇక ఈ విషయం పై మూవీ టీం అసహనం వ్యక్తం చేస్తుంది.

Also read : NBK109 : బాలయ్య, బాబీ సినిమా టైటిల్ అదేనట.. ‘వీరమాస్‌’గా ఉందిగా..

ఈ నెగటివిటీ పై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. “ఇటీవల కేరళలోని ఓ కోర్టు సినిమా రివ్యూల పై ఓ తీర్పు ఇచ్చినట్లు నేను విన్నాను. సినిమా రిలీజైన మూడు రోజుల వరకు రివ్యూలు రాయొద్దు అని న్యాయస్థానం తీర్పు ఇచ్చిందట. అదే రూల్ ని ఇక్కడ కూడా తీసుకు వస్తే తప్ప సినిమాని కాపాడుకోలేము” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక సోషల్ మీడియాలో వస్తున్న నెగటివిటీ పై దిల్ రాజు టీం అండ్ విజయ్ దేవరకొండ టీం రియాక్ట్ అవుతూ.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెగిటివిటీ వ్యాప్తి చేస్తున్న వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటే సినిమా వసూళ్లపై చాలా ప్రభావం పడుతోందని కంప్లైంట్ లో పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ స్టార్ హాట్ టాపిక్ అయ్యింది.