MS Dhoni fan : నీ పిచ్చి త‌గలెయ్యా.. ధోనీని చూసేందుకు కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన రూ.64 వేలు పెట్టి టికెట్ కొన్న ఫ్యాన్

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి మూడు సంవ‌త్స‌రాలు దాటినా కూడా టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు

MS Dhoni fan : నీ పిచ్చి త‌గలెయ్యా.. ధోనీని చూసేందుకు కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన రూ.64 వేలు పెట్టి టికెట్ కొన్న ఫ్యాన్

CSK fan pays Rs 64000 to watch MS Dhoni live delays paying daughter school fees

MS Dhoni : అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి మూడు సంవ‌త్స‌రాలు దాటినా కూడా టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు స‌రిక‌దా మ‌రింత పెరిగింది. ధోనికి ఇదే చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అని ప్ర‌చారం జ‌రుగుతుండ‌డంతో అత‌డిని స్టేడియంలో ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని ఎంతో మంది అభిమానులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆడే మ్యాచుల్లో స్టేడియాలు అన్నీ కిక్కిరిపోతున్నాయి. ధోని నామ‌స్మ‌ర‌ణ‌తో స్టేడియాలు మారుమోగిపోతున్నాయి.

ధోనిని మైదానంలో ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు ఓ ఫ్యాన్ చేసిన ప‌ని ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. కొంద‌రు అత‌డు చేసిన ప‌నిని స‌మ‌ర్థిస్తుంటే మ‌రికొంద‌రు మాత్రం త‌ప్పుబ‌డుతున్నారు. ఓ అభిమాని ఎంఎస్ ధోనిని చూసేందుకు బ్లాక్‌లో రూ.64,000 ఖ‌ర్చు చేసి మ‌రీ టికెట్లు కొన్నాడు.అయితే.. అవి త‌న కూతురు స్కూల్ ఫీజు కోసం దాచిన డ‌బ్బులు అట‌. పాఠ‌శాల ఫీజు చెల్లించేందుకు కొంత స‌మ‌యం ఉండ‌డంతో ఆలోగా ఎలాగో స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చున‌ని అత‌డు భావించాడ‌ట‌.

Also Read: త‌న రిటైర్‌మెంట్ పై రోహిత్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

త‌మిళ‌నాడుకు చెందిన అభిమాని స్పోర్ట్స్‌వాక్ చెన్నై ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాతృభాషలో మాట్లాడుతూ.. CSK మ్యాచ్‌కి టికెట్ల‌ కోసం రూ. 64,000 ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. త‌న‌కు ముగ్గురు కుమారైలు ఉన్నార‌ని, వారంతా ధోనీని చూడాల‌ని ఉంది అని చెప్పారు. దీంతో ఓ కూతురికి స్కూల్ ఫీజు కోసం దాచిన డ‌బ్బుల‌తో అంద‌రికీ బ్లాక్‌లో టికెట్లు కొన్న‌ట్లు వివ‌రించాడు.

ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మార‌గా నెటిజ‌న్లు రెండుగా విడిపోయారు. కొంద‌రు అత‌డికి మ‌ద్ద‌తుగా మాట్లాడితే ఎక్కువ మంది మాత్రం ఇలా చేయ‌డం త‌ప్ప‌ని అన్నారు. కూతురు భ‌విష్య‌త్తు ముఖ్య‌మ‌ని అన్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చెన్నై ఐదు మ్యాచులు ఆడింది. మూడు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. ఆరు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.

Also Read : రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వార్న‌ర్‌.. న‌వ్వులే న‌వ్వుల్‌.. కెమెరాను బ‌ద్ద‌లు కొట్టి..