SRH vs LSG : కాస్త కరుణించు వరుణదేవా.. మ్యాచ్ రద్దైతే సన్‌రైజర్స్ పరిస్థితేంటంటే?
ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
![SRH vs LSG : కాస్త కరుణించు వరుణదేవా.. మ్యాచ్ రద్దైతే సన్‌రైజర్స్ పరిస్థితేంటంటే? SRH vs LSG : కాస్త కరుణించు వరుణదేవా.. మ్యాచ్ రద్దైతే సన్‌రైజర్స్ పరిస్థితేంటంటే?](https://10tv.in/wp-content/uploads/2024/05/Rain-likely-to-play-spoilsport-in-SRH-vs-LSG-clash-in-Hyderabad.jpg)
Rain likely to play spoilsport in SRH vs LSG clash in Hyderabad
SRH vs LSG – IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతోంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచేందుకు అన్ని జట్లు తమ శక్తి మేరు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లకు ఎంతో కీలకం. ఇరు జట్లు కూడా ఇప్పటి వరకు చెరో 11 చొప్పున మ్యాచులు ఆడాయి. చెరో ఆరు మ్యాచుల్లో విజయాలు సాధించాయి.
అయితే.. నెట్‌రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉండడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. లక్నో సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి.
Sanju Samson : ఎవరైనా అంపైర్‌తో వాగ్వాదం చేస్తే.. శిక్ష ఇలాగే ఉంటుంది.. సంజూకు బీసీసీఐ షాక్
వరుణుడు కరుణించేనా..?
హోం గ్రౌండ్ ఉప్పల్‌లో ఆడుతుండడం సన్‌రైజర్స్‌కు కలిసి వచ్చే అంశం. అయితే.. ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఇక ఉప్పల్ మైదానంలో కురిసిన వర్షం సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో పిచ్‌తో పాటు చాలా భాగాన్ని కవర్లలో కప్పి ఉంచారు.
బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.
RCB : ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే.. ఈ 4 నాలుగు జరగాల్సిందే
వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే..?
వర్షం పడినప్పటికీ ఓవర్లను కుదించి ఆడే అవకాశం ఉంటుంది. అయితే.. ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు చెరొ పాయింట్‌ను కేటాయిస్తారు.
It’s Raining in Uppal stadium 🏟️ pic.twitter.com/J8dBHXxHpA
— SunRisers OrangeArmy Official (@srhfansofficial) May 7, 2024
తుది జట్ల అంచనా..
సన్ రైజర్స్ హైదరాబాద్ : ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, షహబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కత్/ఉమ్రాన్ మాలిక్. ఇంపాక్ట్: నటరాజన్
Dinesh Karthik : కాఫీ కూడా తాగనివ్వలేదురా అయ్యా.. ఆర్సీబీ వికెట్ల పతనం పై దినేశ్ కార్తీక్
లక్నో సూపర్ జెయింట్స్ : క్వింటన్ డికాక్, మార్కస్ స్టాయినిస్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, ఆయుశ్ బదోని, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్. ఇంపాక్ట్: అర్షిన్ కులకర్ణి