Google Wallet : భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’ వచ్చేసిందోచ్.. ఫుల్ లిస్టు ఇదిగో..!

గూగుల్ వ్యాలెట్ అంతర్జాతీయ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ వ్యాలెట్ బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయదు లేదా డిజిటల్ పేమెంట్లు చేయదు.

Google Wallet : భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’ వచ్చేసిందోచ్..  ఫుల్ లిస్టు ఇదిగో..!

Google Wallet is now available in India ( Image Credit : Google )

Google Wallet : భారత్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ఇటీవల కొత్త వ్యాలెట్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫ్రీ యాప్ రివార్డ్‌లు, టిక్కెట్‌లు, కారు కీని కూడా స్టోర్ చేసేందుకు డిజిటల్ హబ్‌గా పనిచేస్తుంది. భారత్‌లో రిలీజ్ అయిన గూగుల్ వ్యాలెట్ అంతర్జాతీయ వెర్షన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. ఈ వ్యాలెట్ బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయదు లేదా డిజిటల్ పేమెంట్లు చేయదు.

Read Also : Google Pay Soundpad : పేటీఎం, ఫోన్‌పేకు పోటీగా గూగుల్ పే సౌండ్‌ప్యాడ్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?

గూగుల్ పే కంపెనీ నుంచి పేమెంట్ యాప్‌గా కొనసాగుతుంది. గూగుల్ వ్యాలెట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. లేదంటే.. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్‌లోని ఇన్‌స్టాలేషన్ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ‘అన్ని ఫీచర్లు ప్రతి ప్రాంతంలో అందుబాటులో లేవు. అయితే, వాటిని రాబోయే నెలల్లో యూజర్లందరికి అందుబాటులోకి తీసుకువస్తాం’ అని పేర్కొంది.

గూగుల్ వ్యాలెట్ ఎలా ఉపయోగించాలి? :
బోర్డింగ్ పాస్‌లను స్టోర్ చేయడం నుంచి లాయల్టీ ప్రోగ్రామ్ రివార్డ్‌లను నిర్వహించడం వరకు మీ డిజిటల్ లైఫ్ సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను మేనేజ్ చేయొచ్చు. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ వ్యాలెట్ ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ వ్యాలెట్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి.
  • డౌన్‌లోడ్ చేసిన తర్వాత గూగుల్ వ్యాలెట్ యాప్‌ని ప్రారంభించి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో చేయండి.
  • మీరు కొత్తవారైతే, మీరు పేమెంట్ కార్డ్‌ని యాడ్ చేయమని ప్రాంప్ట్ వస్తుంది.
  • దీన్ని మీ కెమెరాతో స్కాన్ చేయవచ్చు లేదా వివరాలను మాన్యువల్‌గా ఎంటర్ చేయవచ్చు.
  • ఇప్పటికే గూగుల్ పే వాడుతుంటే.. మీ కార్డ్‌లు, టిక్కెట్‌లు, పాస్‌లను మీరు గూగుల్ వ్యాలెట్‌లో మీ డాక్యుమెంట్లను చూడవచ్చు.
  • మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో అదనపు భద్రతకు స్క్రీన్ లాక్‌ని కూడా సెటప్ చేయవచ్చు.
  • ముఖ్యంగా, మీ ఫోన్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్ల కోసం మీ డివైజ్ సాఫ్ట్‌వేర్ అవసరాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవాలి.
  • NFC (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) కలిగి ఉందని, మీ డిఫాల్ట్ పేమెంట్ యాప్‌గా గూగుల్ పే సెట్‌తో (NFC) ఆన్ చేసి ఉండాలి.

గూగుల్ వ్యాలెట్ పాత ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయదు :
అయితే, పాత ఆండ్రాయిడ్ యూజర్లను గూగుల్ వ్యాలెట్ ఉపయోగించడానికి గూగుల్ అనుమతించదు. జూన్ 10వ తేదీ నుంచి గూగుల్ వ్యాలెట్ ఇకపై 9 (Pie) కన్నా తక్కువ ఆండ్రాయిడ్ వెర్షన్‌లు లేదా 2.x కన్నా తక్కువ ఉన్న WearOS వెర్షన్‌లను రన్ చేసే ఫోన్లలో పనిచేయదు. ఈ నిర్ణయంతో ఆగస్ట్ 2023లో ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌కు ప్లే సర్వీసుల సపోర్టును ముగించింది. కొత్త భద్రతా ఫీచర్‌లతో పాత సిస్టమ్‌లతో సపోర్టును కొనసాగించడం సవాలుగా మారుతుంది.

ఈ కొత్త అప్‌డేట్ గూగుల్ వ్యాలెట్ సాయంతో కాంటాక్ట్‌లెస్ పేమెంట్లను చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది. గూగుల్ వ్యాలెట్ (గూగుల్ పే) ఆండ్రాయిడ్ 5.0 (Lollipop) వరకు డివైజ్‌లకు సపోర్టు ఇచ్చింది. ఈ అప్‌డేట్ ఆండ్రాయిడ్ Nougat (7.0, 7.1), ఓరియో (8.0, 8.1)లోని యూజర్లపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ, 86 శాతానికి పైగా ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఇప్పటికే ఆండ్రాయిడ్ 9 లేదా అంతకంటే ఆపై వెర్షన్‌ను కలిగి ఉన్నాయి. ఈ మార్పు యూజర్లపై పెద్దగా ప్రభావం చూపదని గమనించాలి.

గూగుల్ పేకి భిన్నంగా గూగుల్ వ్యాలెట్ :
ముఖ్యంగా, గూగుల్ పే, గూగుల్ వ్యాలెట్ అనేవి స్పెషల్ యాప్‌లు. గూగుల్ పే ఆర్థిక లావాదేవీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే.. డబ్బు పంపడం, స్వీకరించడం, రివార్డ్‌లను సంపాదించడం వంటివి అనుమతిస్తుంది. మరోవైపు, గూగుల్ వ్యాలెట్ బోర్డింగ్ పాస్‌లు, లాయల్టీ కార్డ్‌లు, ఐడీల వంటి డిజిటల్ అవసరాలను సురక్షితంగా ఉంచుతుంది. మీ ఫోన్‌లో ముఖ్యమైన విషయాలను యాక్సెస్ చేసేందుకు వీలుంటుంది. అంతేకాదు.. ఆపిల్ వ్యాలెట్ మాదిరిగా ఉంటుంది. గూగు్ పే, వ్యాలెట్‌‌లో కొంచెం తేడాలు ఉన్నప్పటికీ, రెండు యాప్‌లు మీ ఫోన్‌లోనే ఉంటాయి.

Read Also : HMD Pulse Arrow : భారత్‌కు హెచ్ఎండీ ‘యారో’ ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. హెచ్ఎండీ పల్స్‌కు రీబ్రాండెడ్ వెర్షన్!