PM Modi: నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 2,85,60,338 ఉన్నాయని తెలిపారు. రూ.2.67 లక్షల విలువైన పసిడి..

PM Modi: నరేంద్ర మోదీ మొత్తం ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

PM Narendra Modi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల వివరాలను తెలిపారు. మొత్తం రూ.3.02 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు చెప్పారు. తన వద్ద ప్రస్తుతం రూ.52,920 నగదు ఉన్నట్లు తెలిపారు.

అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ. 2,85,60,338 ఉన్నాయని తెలిపారు. రూ.2.67 లక్షల విలువైన పసిడి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో 9.12 లక్షల రూపాయల పెట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 2014లో మోదీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ అప్పట్లో రూ.1.66 కోట్లుగా ఉంది. అలాగే, 2019లో మోదీ ఆస్తుల విలువ రూ.2.51 కోట్లు.

కంగనా ఆస్తులు రూ.90 కోట్లు
హిమాచల్ ప్రదేశ్, మండి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ మొత్తం రూ.90 కోట్లని అఫిడవిట్లో పేర్కొన్నారు. అందులో రూ.28.73 కోట్ల చరాస్తులు, రూ.62.92 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు చెప్పారు.

ఆమెకు ముంబై, పంజాబ్, మనాలిలోనూ ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ ద్వారా తెలిసింది. అలాగే, కంగనాకు రూ.3.91 కోట్ల విలువైన 3 లగ్జరీ కార్లు ఉన్నాయి. ఆమె వద్ద ప్రస్తుతం రూ.2 లక్షల నగదు ఉందని చెప్పారు.

Also Read: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత