IPL 2024 : రాజస్థాన్ జట్టుకు ఏమైంది.. ఇలాఅయితే ఫైనల్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవటమే!

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకున్నప్పటికీ.. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోవటంతో ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

IPL 2024 : రాజస్థాన్ జట్టుకు ఏమైంది.. ఇలాఅయితే ఫైనల్ మ్యాచ్ పై ఆశలు వదులుకోవటమే!

Rajasthan Royals Team (Credit_ Twitter)

RR vs PBKS : ఐపీఎల్ 2024 లో భాగంగా బుధవారం రాత్రి గౌహతిలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 48 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పోగొట్టుకుంది. ఆ తరువాత సామ్ కరన్ (63 నాటౌట్) అద్భుత బ్యాటింగ్ తో పరుగులు రాబట్టడంతో 18.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి పంజాబ్ జట్టు 145 పరుగులు చేసి విజేతగా నిలిచింది. అయితే, పంజాబ్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచినప్పటికీ ప్లే ఆఫ్స్ ఆశలను కోల్పోయింది. ఆ జట్టు 13 మ్యాచ్ లు ఆడి కేవలం ఐదు మ్యాచ్ ల్లోనే విజయం సాధించింది. మరో మ్యాచ్ ఈ నెల 19న హైదరాబాద్ జట్టుతో ఆడనుంది.

Also Read : బాలికపై అత్యాచారం కేసులో క్రికెటర్ సందీప్ లామిచానేకు ఊరట.. ఎనిమిదేళ్ల జైలు శిక్ష రద్దు

రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకున్నప్పటికీ.. వరుసగా నాలుగు మ్యాచ్ లలో ఓడిపోవటంతో ఆ జట్టు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు ఆడిన రాజస్థాన్.. ఎనిమిది విజయాలతో 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ కు చేరింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. మరో మ్యాచ్ ఈనెల 19న కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుతో ఆడాల్సి ఉంది. కేకేఆర్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్ కు చేరి 19 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ జట్టు పంజాబ్ పై ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంను చేరుకునే అవకాశాలను కోల్పోయింది.

Also Read : RCB : కోహ్లికి సాయం చేసిన పంత్‌.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కు లైన్ క్లియ‌ర్‌..! ఇక మిగిలింది చెన్నై ఒక్క‌టే..

19న జరిగే మ్యాచ్ లో కేకేఆర్ జట్టుపై విజయం సాధించినప్పటికీ 18 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. ఒకవేళ ఎస్ఆర్ హెచ్ జట్టు రెండు మ్యాచ్ లలో విజయం సాధించి రన్ రేటు మెరుగ్గా ఉంటే పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు చేరుకునే అవకాశం ఉంటుంది. రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్స్ కు చేరినప్పటికీ.. పంజాబ్ జట్టుపై ఓటమితో వరుసగా నాలుగు మ్యాచ్ లు ఓడిపోయింది. దీంతో ప్లేఆఫ్ లోనూ రాజస్థాన్ ప్లేయర్లు ఇదే ఆటతీరును ప్రదర్శిస్తే ఫైనల్ కు చేరుకునే అవకాశాలు ఉండవని జట్టు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.