Cyber Alert : మీరు వాడేది ఇవేనా? 10 అత్యంత సాధారణ 4-డిజిట్ పిన్‌లివే.. తస్మాత్ జాగ్రత్త.. వెంటనే పిన్ మార్చుకోండి..!

2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులలో సంవత్సరానికి 33శాతం పెరిగిందని, అందులో భారత్ ప్రపంచంలోనే అత్యంత లక్ష్యంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉందని చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక తెలిపింది.

Cyber Alert : మీరు వాడేది ఇవేనా? 10 అత్యంత సాధారణ 4-డిజిట్ పిన్‌లివే.. తస్మాత్ జాగ్రత్త.. వెంటనే పిన్ మార్చుకోండి..!

These Are 10 Most Common 4-Digit PINs

Cyber Alert : మీరు ఇలాంటి పాస్‌వర్డ్ వాడుతున్నారా? మీ బ్యాంకు అకౌంట్ పిన్ ఇదేనా? పొరపాటున కూడా ఈ తరహా ఫోర్ డిజిట్ పిన్లను అసలు వాడొద్దు. లేదంటే.. మీ అకౌంట్లను హ్యాకర్లు ఈజీగా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని అంటున్నారు సైబర్ నిపుణులు. 2024 మొదటి త్రైమాసికంలో సైబర్ దాడులలో సంవత్సరానికి 33శాతం పెరిగిందని, అందులో భారత్ ప్రపంచంలోనే అత్యంత లక్ష్యంగా ఉన్న దేశాలలో ఒకటిగా ఉందని చెక్ పాయింట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ నివేదిక తెలిపింది.

Read Also : Disney Plus Share Password : నెట్‌‌ఫ్లి‌క్స్ బాటలో డిస్నీ ప్లస్.. ఇకపై పాస్‌‌వర్డ్ షేరింగ్ చేయలేరు.. అదనంగా చెల్లించాల్సిందే..!

కంప్యూటర్ సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లలో వీక్ పాస్‌వర్డ్‌లను సైబర్ నేరస్థులు సులభంగా క్రాక్ చేస్తున్నారని గుర్తించారు. ముఖ్యంగా వ్యాపారాలు, ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడానికి ఫిషింగ్ స్కామ్‌లు, రాన్‌సోమ్‌వేర్ (ransomware) వంటి వివిధ పద్ధతులను ఉపయోగిస్తారు.

సైబర్ దాడుల పెరుగుదలకు కారణమేంటి? :
ఏదైనా సిస్టమ్‌ను క్రాక్ చేయడానికి వీక్ పిన్ సులభమైన మార్గంగా చెప్పవచ్చు. ఇలాంటి వీక్ పిన్ అనేది సాధారణంగా ఎక్కువ మంది వాడే వాటిలో 1234 లేదా 0000 వంటివి కావచ్చు లేదా మీ పుట్టిన తేదీ లేదా ఫోన్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారం ఆధారంగా సులభంగా హ్యాకర్లు క్రాక్ చేసేలా ఉంటాయి.

అత్యంత సాధారణ 4-అంకెల పిన్‌లు ఏంటి? :
సైబర్‌సెక్యూరిటీ అధ్యయనంలో చాలా మంది తమ సెక్యూరిటీ కోడ్‌లలో సాధారణ ప్యాట్రన్స్ ఉపయోగిస్తారని సూచిస్తుంది. పరిశీలించిన 3.4 మిలియన్ పిన్‌లలో అత్యంత సాధారణ ప్యాట్రన్స్ ఎక్కువగా ఉన్నాయి. అందులో 10 అత్యంత సాధారణ 4-అంకెల పిన్‌లు ఉన్నాయి. మీరు కూడా ఈ వీక్ పిన్ ప్యాట్రన్స్ వాడుతుంటే.. ఇప్పుడే పిన్ మార్చుకోండి.

  • 1234
  • 1111
  • 0000
  • 1212
  • 7777
  • 1004
  • 2000
  • 4444
  • 2222
  • 6969

సులభంగా ఊహించగలిగే పిన్‌లను ఎంచుకోవడం వల్ల సైబర్ నేరగాళ్లు మీ పాస్‌వర్డ్ హ్యాక్ చేసే రిస్క్ ఉంది. మీ అకౌంట్లు, డివైజ్‌లను ప్రొటెక్ట్ చేసేందుకు పిన్ ఎంచుకున్నప్పుడు సెక్యూరిటీపరంగా స్ట్రాంగ్ ఉండేలా చూసుకోవాలి. యూనిక్ పిన్ ఎంచుకోవడం ద్వారా అనధికారిక పిన్ యాక్సెస్ రిస్క్ తగ్గుతుంది. సాధారణ పాస్‌కోడ్‌లను ఉపయోగించకూడదని ఇసెట్ సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు జేక్ మూర్ సూచించారు. చాలా మంది యూజర్లకు తమ పాస్‌వర్డ్ హ్యాక్ చేసే రిస్క్ విషయంలో పెద్దగా అవగాహన ఉండదన్నారు.

చాలామంది హ్యాకర్లు ఇలాంటి పాస్‌కోడ్‌‌లను వేగంగా ఛేదించగలరు. సోషల్ మీడియాతో సహా పర్సనల్ అకౌంట్లలో పుట్టిన సంవత్సరాలు, వ్యక్తిగత సమాచారం లేదా పదేపదే పాస్‌వర్డ్‌లను ఉపయోగించకూడదని గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. సులభంగా ఊహించగలిగే పిన్‌లను ఉపయోగించడం వల్ల హ్యాకర్లు ఈజీగా ఆయా పాస్ కోడ్‌లను హ్యాక్ చేయగలరని ఆయన హెచ్చరిస్తున్నారు. మరికొంతమంది ఉపయోగించే అతి తక్కువ సాధారణమైన 4-అంకెల పిన్‌ల ఓసారి ఇప్పుడు పరిశీలిద్దాం..

  • 8557
  • 8438
  • 9539
  • 7063
  • 6827
  • 0859
  • 6793
  • 0738
  • 6835
  • 8093

అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. పాస్‌కోడ్‌లను ఇప్పటికీ హ్యాక్ చేయవచ్చు. అదనపు భద్రతకు పాస్‌వర్డ్ మేనేజర్‌లను ఉపయోగించమని మూర్ సూచిస్తున్నారు. ఈ టూల్స్ వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరచగలవు. పూర్తిగా ర్యాండమ్ కోడ్‌లను రూపొందించవచ్చు. మీ పుట్టినరోజు లేదా యానివర్శిరీ వంటి తేదీలపై ఆధారపడొద్దని సైబర్ నిపుణులు మూర్ సూచించారు.

Read Also : WhatsApp Pin Chats : వాట్సాప్ యూజర్లు ఇకపై 3 మెసేజ్‌ల వరకు పిన్ చేయొచ్చు.. ఇదిగో ఇలా!