TS CPGET 2024 : తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్.. త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభం!

తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అతి త్వరలో (TS CPGET) 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (cpget.tsche.ac.in) ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

TS CPGET 2024 : తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్.. త్వరలో రిజిస్ట్రేషన్ ప్రారంభం!

Telangana Post Graduate Entrance Test ( Image Credit : Google )

TS CPGET 2024 : తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (TS CPGET) 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అతి త్వరలో ప్రారంభించనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (cpget.tsche.ac.in) ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ గడువు జూన్ 17 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

Read Also : CBSE Open Book Exams : పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయొచ్చుంటున్న సీబీఎస్ఈ.. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన!

రూ. 500 ఆలస్య రుసుముతో (CPGET 2024) దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ జూన్ 25, 2024. అయితే రూ. 2వేల ఆలస్య రుసుముతో గడువు జూన్ 30, 2024 వరకు ఉంటుంది. సీపీజీఈటీ ప్రవేశ పరీక్ష తాత్కాలికంగా జూలై 5, 2024న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష అనేక నగరాల్లో జరుగనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు సీపీజీఈటీ ప్రవేశ పరీక్ష ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్లను పొందవచ్చు.

ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించిన తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్‌లో సీపీజీఈటీ 2024 తాత్కాలిక ఆన్సర్ కీ, ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనుంది. తాత్కాలిక ఆన్సర్ కీ విడుదల చేసిన తర్వాత అభ్యర్థులు ఆన్సర్ కీలో తమ అభ్యంతరాలను తెలపవచ్చు. తాత్కాలిక ఆన్సర్ కీ తర్వాత సీపీజీఈటీ కోసం ఫైనల్ ఆన్సర్ కీ విడుదల కానుంది. తాత్కాలిక ప్రిలిమినరీ సీపీజీఈటీ ఆన్సర్ కీ ద్వారా ఔత్సాహికులు సీపీజీఈటీ పరీక్షలో గుర్తించిన సమాధానాలను చెక్ చేయగలరు.

అలాగే, మార్కులను లెక్కించగలరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో విద్యార్థులకు ప్రవేశం కల్పించడానికి ఉస్మానియా యూనివర్శిటీ ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షను గతంలో OCET (ఉస్మానియా యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) అని పిలిచేవారు. కానీ, ఇప్పుడు దాన్ని సీపీజీఈటీగా గుర్తించారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?