UK PM Rishi Sunak : కింగ్ చార్లెస్ కన్నా సంపాదనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ రికార్డు

బ్రిటన్‌లోని తొలి వెయ్యి మంది సంపన్నులు, వారి సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్‌ రిపోర్ట్ రిలీజ్ చేసింది. కింగ్‌ చార్లెస్‌ సంపద ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది.

UK PM Rishi Sunak : కింగ్ చార్లెస్ కన్నా సంపాదనలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ రికార్డు

UK PM Rishi Sunak, King Charles ( Image Credit : Google )

UK PM Rishi Sunak : భారత సంతతికి చెందిన ఇతను బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌.. ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తి బ్రిటన్‌ ప్రధాని కావడమే చాలా గ్రేట్. అలాంటిది బ్రిటన్‌ రాజు కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు రికార్డులకు ఎక్కారు. ఏడాదిలో రిషి సునాక్‌, అతని భార్య అక్షితామూర్తి ఆస్తి దాదాపు 120మిలియ‌న్ పౌండ్లు పెరిగిందని సండే టైమ్స్ ప్రకటించింది.

రాజును దాటిన ప్రధాని ఫ్యామిలీ ఆదాయం :
బ్రిటన్‌లోని తొలి వెయ్యి మంది సంపన్నులు, వారి సంపదను అంచనా వేస్తూ సండే టైమ్స్‌ లేటెస్ట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇందులో కింగ్‌ చార్లెస్‌ సంపద ఏడాది కాలంలో 600 మిలియన్‌ పౌండ్ల నుంచి 610 మిలియన్‌ పౌండ్లకు పెరిగింది. సునాక్‌ దంపతుల సంపద మాత్రం 529 మిలియన్‌ పౌండ్ల నుంచి 651 మిలియన్‌ పౌండ్లకు చేరుకుంది. అయితే బ్రిటన్ రాజు కుటుంబ సంపదను కచ్చితంగా అంచనా వేయడం కష్టమేనని సండే టైమ్స్ తెలిపింది. అతనికి ఎన్నో ఎస్టేట్లు, ప్యాలెస్‌లు ఉన్నాయని.. వాటి విలువ కొన్ని బిలియన్‌ పౌండ్లుగా ఉంటుందని అంచనా.

2022-23లో రిషి సునాక్‌ దాదాపు రూ.23 కోట్లు సంపాదించగా, ఆయన భార్య అక్షతామూర్తి డివిడెండ్ల రూపంలో ఏకంగా రూ.137 కోట్లు సంపాదించారు. అయితే.. ఇన్ఫోసిస్‌ కంపెనీలో అక్షతా మూర్తికి షేర్లు ఉన్నాయి. అవే వీరింత సంపన్నులు కావడానికి కారణం.

సండే టైమ్స్‌ సంపన్నుల జాబితాలో ఈ దంపతులు గతేడాది 275వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 6వేల 873 కోట్లతో 245వ స్థానానికి చేరుకున్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్ లో సంపన్నుల జాబితాలో చోటు సాధించడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also : India Economy Growing : అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్‌