NKR 21 : కళ్యాణ్ రామ్ 21వ సినిమా గ్లింప్స్ అదిరిందిగా.. బ్లాక్ బస్టర్ పంచ్..
నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
NKR 21 : నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) ఇటీవల బింబిసార( Bimbisara), డెవిల్(Devil) సినిమాలతో మంచి విజయాలు సాధించాడు. ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. గత సంవత్సరం దసరా సమయంలో కళ్యాణ్ రామ్ తన 21వ సినిమా కూడా అనౌన్స్ చేసారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా విజయశాంతి(Vijayashanthi) ఓ ముఖ్య పాత్ర చేస్తుంది.
Also Read : NTR – Kalyan Ram : 101వ జయంతి సందర్భంగా.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన తారక్, కళ్యాణ్ రామ్..
తాజాగా నేడు సీనియర్ ఎన్టీఆర్ 101వ వర్థంతి సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసి షూట్ శరవేగంగా జరుగుతుందని ప్రకటించారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా కనిపించబోతున్నాడని ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తుంది. దీంతో నందమూరి అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ పంచ్ కొడతామని పోస్ట్ చేసారు మూవీ యూనిట్.