Apple WWDC 2024 Event : ఆపిల్ WWDC 2024 కీనోట్ ఈవెంట్ టైమ్, ఫుల్ షెడ్యూల్.. ఏయే ప్రకటనలు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Apple's WWDC 2024 Event Schedule : ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీ, హోంప్యామ్, ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ విజన్ ప్రో, మ్యాక్ కంప్యూటర్ల కోసం నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ప్రకటించే అవకాశం ఉంది.

Apple WWDC 2024 Event : ఆపిల్ WWDC 2024 కీనోట్ ఈవెంట్ టైమ్, ఫుల్ షెడ్యూల్.. ఏయే ప్రకటనలు ఉండొచ్చు? లైవ్ స్ట్రీమింగ్ చూడాలంటే?

Apple's WWDC 2024 Invite Keynote Event ( Image Credit : Google )

Apple WWDC 2024 Event Schedule : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ రాబోయే బిగ్ ఈవెంట్ కోసం సన్నాహాలు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం.. ఆపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 ఈవెంట్ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కంపెనీ, ఇప్పుడు వార్షిక వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ గురించి అదనపు వివరాలను షేర్ చేసింది. ఇందులో కీనోట్ ఈవెంట్ సమయం, ఈవెంట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ కూడా ఉన్నాయి.

ఈ ఏడాదిలో ఆపిల్ ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఆపిల్ టీవీ, హోంప్యామ్, ఎయిర్ ప్యాడ్స్, ఆపిల్ విజన్ ప్రో, మ్యాక్ కంప్యూటర్ల కోసం నెక్స్ట్ జనరేషన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ప్రకటించాలని భావిస్తోంది. కంపెనీ కొత్త హార్డ్‌వేర్‌ను ఆవిష్కరించనప్పటికీ, ఈ ఏడాదిలో ఈవెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్‌లపై దృష్టిసారిస్తుందని భావిస్తున్నారు.

Read Also : Apple iPhone 15 Discount : ఆపిల్ ఐఫోన్ 15పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.13వేలు డిస్కౌంట్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే..!

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 కీనోట్ ఈవెంట్ సమయం, లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి? :
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్‌లో ఎంపిక చేసిన డెవలపర్‌ల కోసం కీనోట్ ఈవెంట్‌తో ప్రారంభమవుతుంది. కంపెనీ యూట్యూబ్ ఛానెల్, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్, ఆపిల్ డెవలపర్ యాప్, ఆపిల్ టీవీ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ కానుంది.

ఆపిల్ కీనోట్ ఉదయం 10am పీడీటీ ( భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30)కి ప్రారంభం కానుంది. ఆపిల్ డెవలపర్ యాప్, ఆపిల్ డెవలపర్ వెబ్‌సైట్ ద్వారా మంగళవారం అర్ధరాత్రి 1:30 గంటలకు ఆపిల్ ప్లాట్‌ఫారమ్ స్టేట్ ఆఫ్ యూనియన్‌ని స్ట్రీమింగ్ చేయనుంది. దీని ద్వారా టెక్ ఔత్సాహికులు, డెవలపర్‌లు తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్‌కి వచ్చే కొత్త ఫీచర్ల వివరాలను తెలుసుకోవచ్చు.

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 పూర్తి షెడ్యూల్ :
డబ్ల్యూడబ్ల్యూడీసీ (WWDC 2024) కీనోట్, ప్లాట్‌ఫారమ్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ తర్వాత ఆపిల్ డెవలపర్ కాన్ఫరెన్స్ 100 కన్నా ఎక్కువ టెక్నికల్ సెషన్‌లతో కొనసాగుతుంది. ఇందులో ఆపిల్ డిజైనర్లు, ఇంజనీర్లు, ఇతర నిపుణులతో యూట్యూబ్, ఆపిల్ డెవలపర్ వెబ్‌సైట్‌లో రాబోయే కొద్ది రోజుల్లో లాంచ్ అయ్యేలా షెడ్యూల్ అయింది. అంతేకాదు.. కంపెనీ ఆపిల్ పార్క్‌లో మూడు రోజుల పాటు వార్షిక స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్‌లో 50 మంది విశిష్ట విజేతలను నిర్వహిస్తుంది.

కంపెనీ ప్రకారం.. ఈ విజేతలు డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 వారంలో ప్రత్యేక కార్యకలాపాలలో భాగం అవుతారు. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024లో వార్షిక ఆపిల్ డిజైన్ అవార్డుల విజేతలను కూడా ఆపిల్ వెల్లడిస్తుందని భావిస్తున్నారు. ఆపిల్ డెవలపర్ వెబ్‌సైట్, యాప్‌లో ఈ ఏడాది ఫైనలిస్ట్‌లు ప్రకటించగా.. త్వరలో విజేతలను కూడా ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది.

డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024 ఏయే ప్రకటనలు ఉండొచ్చు :
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024లో ఆపిల్ రాబోయే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌ల వివరాలను ప్రకటిస్తుందని భావిస్తున్నారు. ఐఓఎస్ 18, ఐప్యాడ్ఓఎస్ 18, మ్యాక్ఓఎస్ 15, వాచ్ఓఎస్ 11, టీవీఓఎస్ 18, విజన్ఓఎస్ 2 ఉంటాయి. ఇటీవలి నివేదికల ప్రకారం.. ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అనేక అప్‌గ్రేడ్‌లపై పనిచేస్తోందని సూచిస్తున్నాయి.

కస్టమైజ్ పరంగా ఐఓఎస్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో సహా కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. అయితే, సిరి కొత్త సామర్థ్యాలతో అప్‌డేట్ చేయొచ్చు. నివేదికల ప్రకారం.. ఐఓఎస్ 18లో చాట్‌బాట్ ఫీచర్‌లను ప్రవేశపెట్టడానికి కంపెనీ ఓపెన్ఏఐ, గూగుల్‌తో చర్చలు జరుపుతోంది.

మీ ఐఫోన్ డివైజ్‌‌‌లో క్లౌడ్ ఆధారిత ఏఐ యాక్టివిటీ రెండింటినీ అందజేస్తుంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ 2024లో కొత్త హార్డ్‌వేర్‌ను లాంచ్ చేయాలనే ప్లాన్‌లపై ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. కంపెనీ ఇటీవల కొత్త ఆపిల్ పెన్సిల్ ప్రోతో పాటు కొత్త ఐప్యాడ్ ప్రో, ఐప్యాడ్ ఎయిర్ మోడల్‌లను ఈ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. ఏది ఏమైనప్పటికీ, ఆపిల్ ఈవెంట్‌లలో ఏయే ప్రొడక్టులను లాంచ్ చేయనుందో తెలియాలంటే అప్పటివరకూ వేచి ఉండాల్సిందే.

Read Also : Anant Ambani-Radhika 2 Pre-Wedding : అనంత్ అంబానీ రాధికల రెండో ప్రీ-వెడ్డింగ్.. సెలబ్రిటీలు ఎవరెవరు హాజరుకానున్నారంటే?