IND vs IRE : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డులో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆశ్చ‌ర్య‌పోయిన రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి.. వీడియో వైర‌ల్‌

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా ఘ‌నంగా బోణీ కొట్టింది.

IND vs IRE : బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డులో సూప‌ర్ ట్విస్ట్‌.. ఆశ్చ‌ర్య‌పోయిన రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి.. వీడియో వైర‌ల్‌

Rohit Kohli React As Best Fielder Award Returns With Fresh Twist

India vs Ireland : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా ఘ‌నంగా బోణీ కొట్టింది. న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. 16 ఓవ‌ర్ల‌లో 96 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ల‌క్ష్యాన్ని భార‌త్ 12.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(37 బంతుల్లో 52 రిటైర్డ్ హార్ట్‌) హాఫ్ సెంచ‌రీ బాద‌గా రిష‌బ్ పంత్ (26 బంతుల్లో 36 నాటౌట్‌) రాణించాడు.

కాగా.. భార‌త జ‌ట్టు మేనేజ్‌మెంట్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బెస్ట్ ఫీల్డ‌ర్ మెడ‌ల్‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న చేసిన ఫీల్డ‌ర్ కు ఈ మెడ‌ల్‌ను బ‌హుక‌రిస్తూ వ‌స్తున్నారు. తాజాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ దీన్ని కొన‌సాగిస్తున్నారు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో అత్యుత్త‌మంగా ఫీల్డింగ్ చేసిన వారి పేరును డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్ దిలీప్ ప్ర‌క‌టించారు.

Rohit Sharma: ఏం బాదుడు భయ్యా.. సిక్సర్ల వీరుడు.. రోహిత్ శర్మ మరో ఘనత

అక్ష‌ర్ ప‌టేల్ క్యాచ్ అండ్ బౌల్ అందుకుని జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక కోహ్లి అయితే మైదానంలో క‌దిలిన విధానం అద్భుతం. దాదాపుగా అంద‌రూ త‌మ ఆట‌తీరుతో మెప్పించారు. అయితే.. ఈ మ్యాచ్‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ కు ఫీల్డ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ల‌భిస్తుంది అని దిలీప్ అన్నారు. ఈ మ్యాచ్ లో సిరాజ్ మూడు ఓవ‌ర్లు వేసి 13 ప‌రుగులు ఇచ్చి ఓ వికెట్ తీశాడు.

అయితే.. ఈ మెడ‌ల్‌ను ఓ యువ అభిమాని చేత ఇప్పించ‌డం విశేషం. సుబేక్ అనే బాలుడు నేరుగా అర్ష్‌దీప్ వ‌ద్ద‌కు వెళ్లి అభినంద‌న‌లు చెప్పాడు. ఆ త‌రువాత సిరాజ్ వ‌ద్ద‌కు వెళ్లి కంగ్రాట్స్‌ చెప్పి మెడ‌ల్ ను అందించాడు. ఈ వీడియోను బీసీసీఐ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చాహ‌ల్ ఆ యువ అభిమానిని డ్రెస్సింగ్ రూమ్‌లోకి తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో రోహిత్, కోహ్లి ఆశ్చ‌ర్య‌పోయారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

Pakistan : అభిమానుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసిన పాకిస్తాన్ జ‌ట్టు.. ఒక్కొక్క‌రికి 25 డాల‌ర్లు..!

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)