Rohit Sharma : రోహిత్ శ‌ర్మ భావోద్వేగ‌పు పోస్ట్.. రాహుల్‌ భాయ్‌ నా నమ్మకం, నా కోచ్‌, నా స్నేహితుడు ..

త‌న కుటుంబంతో క‌లిసి ద్ర‌విడ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ ఈ విష‌యాల‌ను పంచుకున్నాడు.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ భావోద్వేగ‌పు పోస్ట్.. రాహుల్‌ భాయ్‌ నా నమ్మకం, నా కోచ్‌, నా స్నేహితుడు ..

Rohit Sharma shares heartwarming post for Rahul Dravid

Rohit Sharma – Rahul Dravid : ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టీ20 ప్రపంచ‌క‌ప్ మొత్తానికి భార‌త్ సొంత‌మైంది. రాహుల్ ద్ర‌విడ్ మార్గ‌నిర్దేశ్యంలో రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలో 17 ఏళ్ల క‌ల నెర‌వేరింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పూర్తి కావ‌డంతో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వీకాలం ముగిసింది. మ‌రికొద్ది రోజుల్లోనే టీమ్ఇండియాకు కొత్త కోచ్ రానున్నాడు. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ద్ర‌విడ్‌తో త‌న‌కు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. త‌న‌లాంటి వ్య‌క్తితో ప‌ని చేయ‌డం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు. త‌న కుటుంబంతో క‌లిసి ద్ర‌విడ్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ రోహిత్ ఈ విష‌యాల‌ను పంచుకున్నాడు.

‘ప్రియమైన రాహుల్‌ భాయ్‌.. నా మ‌న‌సులో మెదిలే భావాల‌ను తెలియ‌జేసేందుకు స‌రియైన ప‌దాల కోసం వెతుక్కొంటున్నాను. అయిన‌ప్ప‌టికి స‌రిగ్గా చెప్ప‌లేనేమోన‌ని అనిపిస్తుంది. అయిన‌ప్ప‌టికి కూడా నేను చెప్పాల‌నుకున్న‌ది చెప్పుతాను.’ అని రోహిత్ అన్నాడు. కోట్లాది మంది అభిమానుల్లాగానే తాను కూడా చిన్న‌ప్ప‌టి నుంచి ద్ర‌విడ్ ను చూస్తూ పెరిగాన‌న్నాడు. అయితే.. ఎంతో మందికి రానీ అదృష్టం త‌న‌కు ద‌క్కింద‌న్నాడు.

Siraj : టీమ్ఇండియా పేస‌ర్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

ద్ర‌విడ్‌ను ద‌గ్గ‌ర‌గా చూడ‌డ‌మే కాదు.. క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం వ‌చ్చింద‌న్నాడు. ‘ఆట‌లో నువ్వు ఒక శిఖ‌రానివి. ఎంత క‌ష్టాన్ని అయినా భ‌రిస్తావు. ప్ర‌తిఫ‌లంగా ఎన్నెన్నో ఘ‌న‌త‌ల‌ను సాధించావు. అయిన‌ప్ప‌టికి కూడా నువ్వు మా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే స‌మ‌యంలో నీ ఘ‌న‌త‌ల‌ను అన్ని ప‌క్క‌న బెడ‌తావు. కేవ‌లం కోచ్‌గా మాత్ర‌మే వ్య‌వ‌హ‌రిస్తావు.’ అని రోహిత్ చెప్పాడు.

‘నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు, సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తావు. ఆటకు, మాకు నువ్విచ్చిన గొప్ప బహుమతి అది. ఆట పట్ల నీకున్న ప్రేమ నీ హుందాతనానికి కారణం. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను.’ అని రోహిత్ తెలిపాడు.

Rahul Dravid : ఇదేం ట్విస్ట్ నాయ‌నా.. రాహుల్ ద్ర‌విడ్‌తో కేకేఆర్ చ‌ర్చ‌లు..! అటు ఇటు.. ఇటు అటు..?

నా భ‌ర్య ఎల్ల‌ప్పుడూ ఓ మాట అంటుంటుంది. నేను ప‌నిలో ఉన్న‌ప్పుడు త‌న‌ను కూడా ప‌ట్టించుకోకుండా ఎప్పుడూ నీతోనే ఉంటాన‌ని చెబుతుంటుంది. రాహుల్‌ భాయ్‌ ‘నీ వర్క్‌ వైఫ్‌’(పనిలో సహచరులు, పరస్పర గౌరవం, మద్దతు, విశ్వసనీయత కలిగి ఉండేవారు) అంటూ నన్ను ఆటపట్టిస్తుందన్నాడు. ఇలా అనిపించుకోవడం కూడా అదృష్టమే అని భావిస్తాన‌ని రోహిత్ అన్నాడు. ద్ర‌విడ్‌ను ఎంతో మిస్ అవుతున్న‌ట్లు చెప్పాడు. కలిసి కట్టుగా మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నానని, రాహుల్‌ భాయ్‌ నా నమ్మకం, నా కోచ్‌, నా స్నేహితుడు అని అనుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది అని రోహిత్ భావోద్వేగానికి లోన‌య్యాడు.

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohitsharma45)