Gautam Gambhir : టీమిండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌ ఆస్తి ఎంతో తెలుసా? ఎన్ని కార్లు ఉన్నాయంటే ..

గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయర్ గా సుదీర్ఘకాలం ఆడటంతో పాటు ఐపీఎల్ లోనూ పలు జట్ల తరపున కెప్టెన్ గా వ్యవహరించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత

Gautam Gambhir : టీమిండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్‌ ఆస్తి ఎంతో తెలుసా? ఎన్ని కార్లు ఉన్నాయంటే ..

TeamIndia head coach Gautam Gambhir

Gautam Gambhir Net Worth : అందరూ ఊహించినట్లుగానే టీమిండియా హెడ్ కోచ్ గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తికావడంతో అతని స్థానంలో గంభీర్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. గంభీర్ అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని జైషా చెప్పారు. శ్రీలంక పర్యటనతో కోచ్ గా గంభీర్ ఇన్నింగ్స్ మొదలు కానుంది. జులై 27న మొదలయ్యే పర్యటనలో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక కావడం పట్ల మాజీ, తాజా క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

Also Read : Gautam Gambhir : అఫీషియ‌ల్ : టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌..

గౌతమ్ గంభీర్ టీమిండియా ప్లేయర్ గా సుదీర్ఘకాలం ఆడటంతో పాటు ఐపీఎల్ లోనూ పలు జట్ల తరపున కెప్టెన్ గా వ్యవహరించాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత ఐపీఎల్ లో వ్యాఖ్యతగా, మెంటర్ గా పనిచేశారు. తద్వారా భారీ మొత్తంలో ఆస్తులను కూడబెట్టాడు. గౌతమ్ గంభీర్ ప్రపంచంలోని ధనిక క్రికెటర్లలో ఒకరిగా ఉన్నాడు. అతని మొత్తం సంపాదన దాదాపు రూ.265 కోట్లు ఉంటుందని అంచనా. గంభీర్ క్రికెట్ నుంచి మాత్రమే కాకుండా బ్రాండ్ స్పాన్సర్ షిప్, అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారీగా ఆస్తులను కూడబెట్టుకున్నాడు. గంభీర్ కు రాజకీయాల్లోనూ ప్రమేయం ఉంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన తన వార్షిక ఆదాయం రూ.12.4 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నాడు.

Also Read : Mahindra XUV700 AX7 : కొత్త కారు కొంటున్నారా? మహీంద్రా ఎక్స్‌యూవీ700 AX7 కారు ఇదిగో.. ధర ఎంతో తెలుసా?

గంభీర్ కు ఢిల్లీలోని రాజిందర్ నగర్ ప్రాంతంలో విలాసవంతమైన ఇల్లు ఉంది. దాని విలువ రూ. 15కోట్లు ఉంటుందని అంచనా. గ్రేటర్ నోయిడాలోని జేపీ విష్‌టౌన్‌లో ఆయనకు రూ. 4కోట్ల విలువైన ప్లాట్ కూడా ఉంది. మల్కాపూర్ గ్రామంలో కోటి విలువైన ప్లాట్ కూడా ఉన్నట్లు తెలిసింది. గంభీర్ చివరిసారిగా 2018లో ఐపీఎల్ లో మ్యాచ్ ఆడాడు. ఆ సీజన్ ఆడినందుకు రూ.2.8కోట్లు అందుకున్నాడు. 2024లో కోల్ కతా నైట్ రైడర్స్ లో మెంటార్ గా పనిచేశాడు. ఆ సమయంలో గంభీర్ కు కేకేఆర్ జట్టు యాజమాన్యం భారీ మొత్తంలో (సుమారు రూ.25కోట్లు) చెల్లించింది. టీమిండియా ప్రధాన కోచ్ గా ఎంపికయిన గంభీర్ కు ద్రవిడ్ (ఏడాదికి రూ. 12కోట్లు) కంటే ఎక్కువ జీతమే ఇస్తున్నట్లు సమాచారం.

Also Read : అప్పుల పాలు చేశారు, తీవ్ర నష్టం కలిగించారు- విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

గౌతమ్ గంభీర్ కు కార్లంటే పిచ్చి. అతని వద్ద పలు రకాల ఖరీదైన కార్లు ఉన్నాయి. గంభీర్ వద్ద ఆడి క్యూ5, బిఎండబ్ల్యూ 530డి కార్లు ఉన్నాయి. అతని కారు కలెక్షన్ లో టయోటా కరోలా, మహీంద్రా బొలెరో స్టింగర్ కూడా ఉన్నాయి. అంతేకాక మెర్సిడెస్ జీఎల్ఎస్ 350డి కూడా గంభీర్ వద్ద ఉంది. దాని విలువ మార్కెట్ ధర ప్రకారం రూ. 88లక్షలు ఉంటుంది. ఇవేకాక పలు రకాల కంపెనీ కార్లు ఉన్నట్లు తెలిసింది.

గౌతమ్ గంభీర్ టీమిండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20మ్యాచ్ లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్ లను గెలుచుకున్న టీమిండియా జట్టులో గంభీర్ కూడా భాగస్వామి. ఆ రెండు టోర్నీల ఫైనల్స్ లో గంభీరే టాప్ స్కోరర్. ఐపీఎల్ లో కెప్టెన్ గా 2012, 2014లో కేకేఆర్ జట్టుకు టైటిళ్లను అందించాడు. 2024లో ఐపీఎల్ లో కేకేఆర్ జట్టుకు మెంటర్ గా వ్యవహరించి టైటిల్ గెలుచుకోవటంలో కీలక భూమిక పోషించాడు.