PCB : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప‌రాభ‌వం.. పీసీబీ మొద‌లెట్టింది.. ఇద్ద‌రి పై వేటు.. లైన్‌లో..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

PCB : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప‌రాభ‌వం.. పీసీబీ మొద‌లెట్టింది.. ఇద్ద‌రి పై వేటు.. లైన్‌లో..

PCB Announces Twin Sackings After T20 World Cup Debacle

Pakistan Cricket Board : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ జ‌ట్టు పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. గ్రూప్ ద‌శ నుంచే ఆ జ‌ట్టు నిష్ర్కమించింది. ఈ నేప‌థ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో పాక్ జ‌ట్టు నిరాశ‌ప‌ర‌చ‌డంతో కెప్టెన్ లేదా కోచ్ లేదా ఇద్ద‌రిపై వేటు వేస్తుంద‌ని అంతా భావించారు. అయితే.. అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా సెల‌క్ట‌ర్ల‌పై వేటు వేసింది.

చీఫ్ సెల‌క్ట‌ర్ వ‌హాబ్ రియాజ్ పై వేటు వేసింది. అంతేకాదండోయ్‌.. పురుషుల‌, మ‌హిళ‌ల సెల‌క్ష‌న్ క‌మిటీలో ఉన్న‌ అబ్దుల్ ర‌జాక్‌ను రెండింటి నుంచి త‌ప్పించింది. జాతీయ సెల‌క్ష‌న్ క‌మిటీలో ఇక‌పై మీ సేవ‌లు ఇక అవ‌స‌రం లేదంటూ వాళ్ల‌కు విష‌యాన్ని చెప్పింది. ఈ మేర‌కు పీసీబీ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.

Gautam Gambhir : ద‌టీజ్ గంభీర్‌.. వ‌చ్చాడు.. వాళ్లే కావాల‌ని డిమాండ్ చేస్తున్నాడు..!

వెస్టిండీస్‌, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ దారుణంగా విఫ‌ల‌మైంది. క‌నీసం గ్రూప్ ద‌శ‌ను దాట‌లేక‌పోయింది. అమెరికా, టీమ్ఇండియా చేతిలో ఓట‌మి పాలు కావ‌డంతో సూప‌ర్ 8కి చేర‌కుండానే బాబార్ సేన ఇంటి దారి ప‌ట్టింది. దీంతో పాక్ జ‌ట్టుపై స్వ‌దేశంలో తీవ్ర విమర్శలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే కెప్టెన్‌గా బాబ‌ర్ ఆజాంను త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కెప్టెన్ పై వేటు వేయాలా వ‌ద్దా అనే విషయాన్ని హెడ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కే వ‌దిలివేసిన‌ట్లుగా తెలుస్తోంది.

పాక్ జ‌ట్టులో భారీ మార్పులు త‌ప్ప‌వ‌ని టీ20 ప్ర‌పంచ కప్ పరాజయం అనంతరం పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ వెల్ల‌డించారు.  అమెరికా, వెస్టిండీస్ పిచ్‌ల‌ను అంచ‌నా వేసి, ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌డంలో విఫ‌ల‌మైన సెల‌క్ట‌ర్ల‌లో ఇద్ద‌రిపై వేటు వేసింది. వీరిద్ద‌రిపై వేటు ప‌డ‌డంతో ప్ర‌స్తుతం సెల‌క్ష‌న్ కమిటీలో మ‌రో ఐదుగురు స‌భ్యులు మాత్ర‌మే ఉంటారు. హెడ్‌ కోచ్‌, కెప్టెన్‌(సంబంధిత ఫార్మాట్‌), మహ్మద్‌ యూసఫ్‌, అసద్‌ షఫీక్‌, బిలాల్‌ అఫ్జల్‌, డేటా అనలిస్టు ఉంటారు.

Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..

కాగా.. పాకిస్తాన్ స్వ‌దేశంలో ఆగ‌స్టు 21 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. అనంత‌రం ఇంగ్లాండ్‌తో మూడు టెస్టులు ఆడ‌నుంది. ఈ సిరీస్‌కు కూడా పాక్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ అనంత‌రం ఆస్ట్రేలియా, జింబాబ్వే, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ల‌కు పాక్ వెళ్ల‌నుంది. ఆసీస్, జింబాబ్వే, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ల్లో ఆయా జ‌ట్ల‌తో పాక్ మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచులు ఆడ‌నుంది.