Chilli Cultivation : మిరప నారుమడిలో మేలైన యాజమాన్యం

Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి.

Chilli Cultivation : మిరప నారుమడిలో మేలైన యాజమాన్యం

Chilli Cultivation Methods

Chilli Cultivation : నీటి వసతి ఉన్న వారు సంవత్సరం పొడవునా మిరప పంట వేసుకోవచ్చు.  ఖరీఫ్‌లో జూలై నుంచి ఆగస్టు వరకు విత్తనాన్ని నారు పోసుకోవచ్చు. మిరపలో మేలైన విత్తనం, నాణ్యమైన నారు అధిక దిగుబడికి సోపానం. మరి ఆరోగ్యకరమైన మిరప నారు పొందాలంటే నారుమడి పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో మిరప చాలా ముఖ్యమైనది. మిరప ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు చాలా ఉన్నాయి. ఆహారానికి రంగు , రుచి ఇవ్వడమే కాకుండా మిరపలో విటమిన్లు, ఔషధ లక్షణాలున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతంలో మిరపను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మిరప 1 లక్షా 34 వేల 960 ఎకరాలలో రైతులు సాగుచేస్తుండగా 7 లక్షల 39 వేల 620 టన్నుల దిగుబడివస్తుంది. తెలంగాణలో 79 వేల హెక్టార్లలో సాగు చేస్తుండగా, 2 లక్షల 80 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడిని తీస్తున్నారు.

ఒక ఖమ్మం జిల్లాలలోనే దాదాపు 22 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు రైతులు  ఇంతటి ప్రాధాన్యత ఉన్న పంటను సాగు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వర్షాధారంగా మిరపను సాగుచేసే రైతులు జులై, ఆగస్టు నెలల్లో నారు పోసుకోవచ్చు . సూటి రకాలైతే ఎకరాకు 650 గ్రాముల విత్తనం సరిపోతుంది.

హైబ్రీడ్ రకాలైతే 100 గ్రా. సరిపోతుంది. అయితే నారుమడుల పెంపకంలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపడితే నాణ్యమైన నారుపెరిగి మంచి దిగుబడులు వస్తాయంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. ముఖ్యంగా నారుమడిలో నారుకుళ్లు తెగులు,  రసం పీల్చే పురుగల ఉధృతి అధికంగా ఉంటుంది. కాబట్టి రైతులు ఈ రెండింటి మీద శ్రద్ధ వహించి వీటిని అరికట్టినట్లైతే  నాణ్యమైన నారును సాధించి , అధిక దిగుబడిని  పొందేందుకు వీలుంటుంది.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు