Wimbledon Final : వామ్మో అంతనా..? పురుషుల వింబుల్డన్ ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ ధ‌ర‌లు చూశారా..?

పురుషుల వింబుల్డన్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది.

Wimbledon Final : వామ్మో అంతనా..? పురుషుల వింబుల్డన్ ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ ధ‌ర‌లు చూశారా..?

Novak Djokovic vs Carlos Alcaraz

పురుషుల వింబుల్డన్ 2024 ఆఖ‌రి అంకానికి చేరుకుంది. నొవాక్ జ‌కోవిచ్‌, కార్లోస్ అల్కరాజ్ లు ఆదివారం ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నారు. ఈ మ్యాచ్ చూసేందుకు టెన్నిస్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు. కాగా.. జొకోవిచ్ ఇప్ప‌టికే ఏడు వింబుల్డ‌న్ టైటిళ్ల‌ను గెలిచాడు. నేటి మ్యాచ్‌లో విజ‌యం సాధించి ఎనిమిది టైటిల్‌ను కైవ‌సం చేసుకుని 25 గ్రాండ్‌స్లామ్‌ల‌తో టెన్నిస్ చ‌రిత్ర‌లో అత్యుత్త‌మ ఆట‌గాడిగా నిల‌వాల‌ని జ‌కోవిచ్ భావిస్తున్నాడు. మ‌రో వైపు 21 ఏళ్ల‌కే మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన అల్క‌రాస్ మ‌రో గ్రాండ్‌స్లామ్‌ను త‌న ఖాతాలో వేసుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. దీంతో మ్యాచ్ హోరాహోరీగా జ‌ర‌గ‌నుంది.

కాగా.. ఈ మ్యాచ్‌ను టెన్నిస్ కోర్టులో ప్ర‌త్య‌క్షంగా చూడాల‌ని చాలా మంది భావిస్తున్నారు. అయితే.. టికెట్ ధ‌ర‌లు సామాన్యుల‌కు అందుబాటులో లేన‌ట్లుగా తెలుస్తోంది. జొకోవిచ్, అల్కరాజ్ ల మధ్య ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ ధ‌ర‌లు క్రీడా చ‌రిత్ర‌లో అత్య‌ధికమైన‌విగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Shubman Gill : మ‌రీ ఇంత స్వార్థ‌ప‌రుడివి ఏంట్రా బాబు.. నువ్వు ఇండియా బాబ‌ర్ ఆజాంవి.. గిల్ పై నెట్టింట దారుణ ట్రోలింగ్‌..

జకోవిచ్-అల్కరాజ్ వింబుల్డన్ ఫైనల్స్ క్రీడల చరిత్రలో అత్యంత ఖరీదైన టికెట్ రేటు క‌లిగిన ఫైన‌ల్‌గా అమెరికన్ స్పోర్ట్స్ వ్యాఖ్యాత డారెన్ రోవెల్ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఒక్కొ సీట్ 10 వేల అమెరిక‌న్ డాల‌ర్ల కంటే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెప్పాడు. అంటే భార‌త క‌రెన్సీలో 8 ల‌క్ష‌ల 35 వేల 193 రూపాయ‌ల‌కు స‌మానం. కాగా.. వింబుల్డ‌న్ కోర్టు కెపాసిటీ 14,797.

ఇదిలా ఉంటే.. వింబుల్డ‌న్ విజేత‌కు రూ.265 కోట్ల ప్రైజ్‌మ‌నీగా ద‌క్క‌నుంది.

MS Dhoni : నేను సైనా నెహ్వాల్ భ‌ర్త‌ని.. ధోనితో క‌శ్య‌ప్‌.. త‌లా ఆన్స‌ర్ వైర‌ల్‌..