హార్దిక్ పాండ్యా క్రేజ్ ఎలా ఉందో.. ఎంత మంది వచ్చారో చూడండి

అభిమానులు భారీ సంఖ్యలో వచ్చిన వీడియోలు సామాజిక..

హార్దిక్ పాండ్యా క్రేజ్ ఎలా ఉందో.. ఎంత మంది వచ్చారో చూడండి

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన అనంతరం టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్‌ పాండ్యా ఇవాళ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. దీంతో అతడికి వడోదరలో ఘన స్వాగతం పలికారు. రోడ్‌ షోతో రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపించాయి.

జాతీయ జెండాలతో హార్దిక్ పాండ్యాకు అభిమానులు స్వాగతం పలుకుతూ కనపడ్డారు. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ కప్ టోర్నమెంట్లో బ్యాటింగ్, బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే.

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ గెలవగానే హార్దిక్ పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. కప్ సాధించిన ఆనందంలో ఏడ్చేశాడు. భారత ఆటగాళ్లకు హగ్ ఇస్తున్నప్పుడూ పాండ్యా కంట కన్నీరు ఆగలేదు. ఐపీఎల్ 2024లో విఫలమైన హార్దిక్ పాండ్యా ఎన్నో అవమానాలు, ఒత్తిళ్ల తర్వాత ప్రపంచ కప్ లో రాణించడంతో అతడు అంతగా భావోద్వేగానికి గురయ్యాడని అభిమానులు భావించారు.

 

View this post on Instagram

 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

Also Read : ఫుట్‌బాల్ అభిమానుల‌కు షాక్‌.. జర్మనీ దిగ్గ‌జ ఆట‌గాడు థామస్ ముల్లర్ రిటైర్‌మెంట్‌..