Viral Video: షార్ట్ వీడియోల పిచ్చి.. కారు డ్రైవ్ చేస్తూ డ్యాన్స్.. 

కారు నడుపుతున్న మహిళ ఇతరుల ప్రాణాలకూ హాని తలపెట్టేలా డ్రైవింగ్..

Viral Video: షార్ట్ వీడియోల పిచ్చి.. కారు డ్రైవ్ చేస్తూ డ్యాన్స్.. 

చాలా మందికి షార్ట్ వీడియోల పిచ్చి పట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో లైకులు, షేర్ల కోసం ప్రమాదకర రీతిలో వీడియోలు తీసుకుంటున్నారు. రీల్స్ కోసం ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ఇటువంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు కారులో కూర్చొని డ్యాన్స్ చేశారు.

అందులో ఒక మహిళ డ్రైవింగ్ చేస్తూ కనపడింది. మహీంద్రా థార్ ఎస్‌యూవీ నడుపుతూ ఈ తీరు ప్రదర్శించారు. ఆ కారును నడుపుతున్న మహిళ ఓ చేతిని స్టీరింగ్ వీల్ నుంచి పైకి ఎత్తి మరీ డ్యాన్స్ చేసింది.. వారు ఘజియాబాద్-ఢిల్లీకి జాతీయ రహదారి 9లో కారులో వెళ్తున్న సమయంలో ఈ వీడియో తీసుకున్నారు.

జర్నలిస్ట్ నిశాంత్ శర్మ ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. కారు నడుపుతున్న మహిళ ఇతరుల ప్రాణాలకూ హాని తలపెట్టేలా డ్రైవింగ్ చేసిందని అన్నారు. ఇటువంటివే ప్రమాదాలకు కారణాలవుతాయని తెలిపారు. అలా డ్రైవ్ చేసే వారిని అరెస్టు చేసి జైలులో వేయాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: షాకింగ్.. ఫ్రెండ్ ప్రాణం తీసిన సరదా.. రెప్పపాటులో ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి..