Andrew Flintoff : వామ్మో.. ఇంగ్లాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు మామూలోడు కాదుగా..

ఇంగ్లాండ్ దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ప్లింటాఫ్ కొడుకు రాకీ ప్లింటాఫ్ చ‌రిత్ర సృష్టించాడు.

Andrew Flintoff : వామ్మో.. ఇంగ్లాండ్ దిగ్గ‌జ ఆట‌గాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు మామూలోడు కాదుగా..

Rocky Flintoff makes history as youngest England U19 centurion

Andrew Flintoff – Rocky Flintoff : ఇంగ్లాండ్ దిగ్గ‌జ ఆల్‌రౌండ‌ర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కొడుకు రాకీ ఫ్లింటాఫ్ చ‌రిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ అండ‌ర్ 19 క్రికెట్‌లో సెంచ‌రీ చేసిన అతి పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. చెల్టెన్‌హాయ్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో రాకీ ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 181 బంతులు ఎదుర్కొన్న రాకీ 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 106 ప‌రుగులు చేశాడు. కాగా.. రాకీ సెంచ‌రీ చేసిన స‌మ‌యంలో అత‌డి తండ్రీ ఆండ్రూ ఫ్లింటాఫ్ స్టాండ్స్‌లోనే ఉన్నాడు.

రాకీ ఫ్లింటాఫ్ అద్భుత సెంచ‌రీతో పాటు కెప్టెన్ హాంజా షేక్ (107) శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 477 ప‌రుగులు చేసింది. అంత‌క‌ముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 153 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఇంగ్లాండ్‌కు 324 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో లంక పోరాడుతోంది. మూడో రోజు లంచ్ విరామానికి ఏడు వికెట్లు కోల్పోయి 246 ప‌రుగులు చేసింది.

IND vs SL : వ‌న్డేల్లో సూర్య‌కుమార్‌ను ఎందుకు తీసుకోలేదు.. రెండు ఫార్మాట్ల‌లో ప‌రాగ్‌కు ఛాన్స్ ఎందుకిచ్చారంటే..?

యువ ఫ్లింటాఫ్కు ఉజ్వల భవిష్యత్తు?

ఈ మ్యాచ్‌లో రాకీ ఫ్లింటాఫ్ ఆడిన విధానం చూస్తుంటే అత‌డు త్వ‌ర‌లోనే జాతీయ జ‌ట్టు త‌రుపున ఆడే అవ‌కాశాలు ఉన్నాయి. అత‌డు త‌న వ‌య‌సుకు మించి ప‌రిణితిని ప్ర‌ద‌ర్శించాడు. కేవ‌లం హిట్టింగ్‌కే ప్రాధాన్యం ఇవ్వ‌కుండా ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా స‌మ‌యోచితంగా బ్యాటింగ్ చేశాడు. జాక్ కార్నీతో ఆరో వికెట్‌కు 78 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.