Nagababu : రాజకీయాల్లో నాకు ఆశలు లేవు.. నాకు వయసు సహకరించినంతవరకు ఈ జీవితం వాళ్ళకే..

తాజాగా నేడు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు పవన్, చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nagababu : రాజకీయాల్లో నాకు ఆశలు లేవు.. నాకు వయసు సహకరించినంతవరకు ఈ జీవితం వాళ్ళకే..

Nagababu Interesting Comments on Chiranjeevi and Pawan Kalyan in Janasena Meeting

Nagababu : పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు కూడా జనసేనలో చేరి ముందు నుంచి కూడా జనసేన కోసం పనిచేసారు. గత ఎన్నికల్లో పొత్తులో భాగంగా అతన సీటుని కూడా వదులుకొని కూటమి గెలుపు కోసం పనిచేసారు. ప్రస్తుతం నాగబాబు జనసేన ప్రధాన కార్యదర్శిగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక నాగబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి.. అన్నదమ్ముల మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో అందరికి తెలిసిందే.

తాజాగా నేడు జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగబాబు పవన్, చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : Soundarya – Krishna Vamsi : సౌందర్యని అలా చూపించింది కృష్ణవంశీ కాదా? ఆ ఛానల్ వాళ్ళా?

నాగబాబు మాట్లాడుతూ.. నేను నిర్మాతగా నష్టపోయి కోట్ల రూపాయలు అప్పు అయితే నా పక్కన ఆ రోజు నిలబడింది నా తమ్ముడు పవన్ కళ్యాణ్, నా అన్నయ్య చిరంజీవి. ఈ జీవితం వాళ్ళ ఆశయాల కోసమే. వాళ్ళ కోసం నిలబడి నాకు చేతనైనంత వరకు సేవ చేస్తాను. రాజకీయాల్లో నాకంటూ ఎటువంటి ఆశలు లేవు. ఎటువంటి పదవి కాంక్షలేదు. మనం గొప్పవాళ్ళం కాకపోయినా ఒక గొప్పవాళ్లకు అండగా నిలబడాలి. నేను అది చేయగలిగాను. పవన్ కళ్యాణ్ ఆశయం కోసం నాకు వయసు సహకరించినంత వరకు చేస్తూనే ఉంటాను. కూటమి ప్రభుత్వం రావడం, పవన్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం మన అదృష్టం అని అన్నారు.