Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐక్యూ నియో 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Amazon Prime Day Sale : ఐక్యూ నియో 9ప్రో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 35,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 37,999, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 39,999 ధరతో వస్తుంది.

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఐక్యూ నియో 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Amazon Prime Day Sale ( Image Source : Google )

Amazon Prime Day Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సేల్ సందర్భంగా ఐక్యూ నియో 9ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ 12ఆర్‌కి పోటీగా ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన ఐక్యూ నియో 9 ప్రో ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ. 30వేల లోపు ధరకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా, ఐక్యూ నియో 9ప్రో అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది.

Read Also : Vivo Y03t Launch : వివో నుంచి సరికొత్త Y03t ఫోన్, స్మార్ట్‌‌వాచ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఐక్యూ నియో 9 ప్రో ధర :
ఐక్యూ నియో 9ప్రో 8జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 35,999, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 37,999, 12జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కి రూ. 39,999 ధరతో వస్తుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 31,998, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 33,998కి జాబితా అయింది. బ్యాంక్ ఆఫర్‌లతో ఈ మిడ్ రేంజ్ ఫోన్ ధర వరుసగా రూ. 29,998, రూ. 31,998కి తగ్గుతుంది.

ఐక్యూ నియో 9 ప్రో స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో 9ప్రో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్టు ఇస్తుంది. ఆసక్తికరంగా, స్మార్ట్‌ఫోన్ నిర్దిష్ట గేమ్‌ల కోసం 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. లేటెస్ట్ ఐక్యూ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా, వన్‌ప్లస్ 11తో పాటు ఇటీవల లాంచ్ అయిన వన్‌ప్లస్ సహా గత ఏడాదిలో అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో కూడా కనిపించింది. గేమింగ్, గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌లకు అడ్రినో 740 జీపీయూ కూడా ఉంది. ఐక్యూ నియో 9ప్రో గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌తో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా.. ఓఐఎస్ సపోర్టుతో 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్ 920 సెన్సార్, 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు 16ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది. ఐక్యూ నియో 9ప్రో 120డబ్ల్యూ పీడీ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్14లో రన్ అవుతుంది. కంపెనీ 3 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్‌లు, 4ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది.

Read Also : Top Smartphone Deals : అమెజాన్‌లో రూ. 20వేల లోపు ధరకే టాప్ స్మార్ట్ ఫోన్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్..!