Ajit Agarkar : మరో రెండేళ్లు సూర్యనే కెప్టెన్..! హార్దిక్, జడేజా పరిస్థితిపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు..
హార్దిక్‌ను కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎట్టకేలకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
Ajit Agarkar – Suryakumar Yadav : శ్రీలంక పర్యటనకు సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. హార్దిక్‌ను కాదని సూర్యకు కెప్టెన్సీ ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎట్టకేలకు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. ఫిట్నెస్ దృష్ట్యానే టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయలేదన్నాడు. శ్రీలంక పర్యటన కోసం భారత జట్టు నేడు (జూలై 22 సోమవారం) బయలుదేరనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్‌తో కలిసి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు ఎందుకు అప్పగించలేదు అనే విషయాన్ని చెప్పాడు. అన్ని సమయాల్లోనూ అందుబాటులో ఉంటే ఆటగాడిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని భావించామని తెలిపాడు. అంతేకాదండోయ్ టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కొనసాగనున్నట్లుగా ఇన్‌డైరెక్టర్‌గా చెప్పేశాడు. ‘ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో సూర్య ఒకడు. మంచి కెప్టెన్‌గా ఉండేందుకు కావాల్సిన లక్షణాలన్నీ అతడిలో ఉన్నాయని భావిస్తున్నాం. రానున్న రెండేళ్లలో అతడు ఏం చేస్తాడో చూడాలి.’ అని అగార్కర్ అన్నాడు.
Richa Ghosh : రిషబ్ పంత్‌కు రిచా ఘోష్ షాక్..
హార్దిక్ అమూల్యమైన ఆటగాడు..
హార్దిక్ పాండ్యా ఎంతో కీలకమైన ఆటగాడని అగార్కర్ చెప్పాడు. హార్దిక్ విషయానికి వస్తే.. ‘అతను ఇప్పటికీ చాలా ముఖ్యమైన ఆటగాడు. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. అయితే.. ఫిట్నెస్ చాలా ముఖ్యం. ప్రస్తుతం అతడు ఫిట్నెస్ కోసం చాలా కష్టపడుతున్నాడు. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ఆటగాడు కావాలి. అందుకనే సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించాం.’ అని అగార్కర్ అన్నాడు.
హార్దిక్ ఏం చేయగలడో మనందరికి తెలుసు. టీ20 ప్రపంచకప్‌లో అతడు బ్యాట్, బాల్‌తో ఎలా రాణించాడో మనం చూశాం. మేము ఆటగాళ్ల అందరితో మాట్లాడుతాం. వారి పాత్రలపై స్పష్టత ఇస్తాం. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్‌ను టీ20లకు మాత్రమే కెప్టెన్‌గా ఎన్నుకున్నాము. వన్డేలకు మాత్రం అతడిని పరిగణలోకి తీసుకోము అని అగార్కర్ చెప్పాడు.
Mohammed Shami : సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు మౌనం వీడిన షమీ..
జడేజా గురించి..
టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే పొట్టి ఫార్మాట్‌కు జడేజా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. లంకతో వన్డే సిరీస్‌కు జడేజాను ఎంపిక చేయలేదు. దీంతో అతడి వన్డే కెరీర్ ఇక ముగిసినట్లేనని వార్తలు వస్తున్నాయి. దీనిపై అగార్కర్ స్పందించాడు. జడేజాలను వన్డేల నుంచి తప్పించలేదన్నాడు. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని లంక పర్యటనకు అతడికి విశ్రాంతి ఇచ్చినట్లుగా చెప్పాడు.