Harish Shankar : ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలి అన్న నెటిజన్.. దర్శకుడు హరీశ్ శంకర్ సమాధానం అదుర్స్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ 'మిస్టర్ బచ్చన్'.
![Harish Shankar : ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలి అన్న నెటిజన్.. దర్శకుడు హరీశ్ శంకర్ సమాధానం అదుర్స్.. Harish Shankar : ఇదే మీ లాస్ట్ రీమేక్ కావాలి అన్న నెటిజన్.. దర్శకుడు హరీశ్ శంకర్ సమాధానం అదుర్స్..](https://10tv.in/wp-content/uploads/2024/07/Harish-Shankar.jpg)
Harish Shankar
Harish Shankar Counter to Netizen : మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ‘మిరపకాయ్’ సినిమా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఈ మూవీ రీమేక్ అంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు. దీన్ని చూసిన చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ సదరు నెటిజన్‌కు అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘సర్ నాదొక విన్నపం. ఇదే మీ చివరి రీమేక్ సినిమా కావాలని కోరుకుంటున్నాను. మీరు సొంతంగా రాసే కథలతో మ్యాజిక్ చేయగలరు. మిరపకాయ్, షాక్ సినిమాలు ఇంకా నా బ్రెయిన్లోనే తిరుగుతున్నాయ్. ఇక విషయానికి వస్తే.. రవితేజ మిస్టర్ బచ్చన్‌కు ఆల్ ది బెస్ట్’ అంటూ ఓ నెటిజన్ దర్శకుడు హరీశ్ శంకర్‌ను ట్యాగ్ చేశాడు.
దీనిపై డైరెక్టర్ హరీశ్ శంకర్ స్పందించాడు. ‘సినిమా చూసిన తరువాత కూడా నువ్వు రీమేక్ అని ఫీలైతే అప్పుడు మాట్లాడుకుందాం బ్రో.. నేను సోషల్ మీడియా ఫ్రెండ్లీ దర్శకుడిని. నువ్వు నాతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు’ అని రిప్లై ఇచ్చాడు.
Idhi choosi nuvvu remake ani feel aithe appudu maatlaadukundhaam bro 😍 am the most social media friendly director… so u can communicate any time https://t.co/rRuIutwD0x
— Harish Shankar .S (@harish2you) July 21, 2024
మిస్టర్ బచ్చన్ మూవీ విషయానికి వస్తే.. బాలీవుడ్ భామ బోర్సే భాగ్యశ్రీ కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతి బాబు విలన్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ‘మోడ్రన్ మాస్టర్స్’ ట్రైలర్ చూశారా?
ఇదిలా ఉంటే.. ఈ సినిమా బాలీవుడ్ మూవీ రైడ్‌కు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమానే హరీశ్ శంకర్ రీమేక్ చేస్తున్నట్లు వార్తలు రాగా.. దీన్ని చిత్ర బృందం ఇప్పటికే ఖండించింది.